చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన తేజ సజ్జ.. 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆనంది - దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది జాంబీల కాన్సెప్ట్ తో వస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా. డిఫరెంట్ జానర్ సినిమా అయినప్పటికీ ఈ చిత్రం మీద మేకర్స్ బాగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అయితే తెలుగు ప్రేక్షకులను ఈ జాంబీల కాన్సెప్ట్ ఏ మేరకు మెప్పిస్తుందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి 'జాంబీ' అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. చనిపోయిన తరువాత శవాలు లేచి జాంబీలుగా మారి బ్రతికున్న వాళ్లని పీక్కుతింటాయి. హాలీవుడ్ లో ఇలా జాంబీల క్కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. అలానే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ హీరోగా రాజ్-డీకే దర్శకత్వంలో 'గో గోవా గోన్' అనే సినిమా తీశారు. ఇక తమిళంలో జయం రవి జాంబీల నేపథ్యంలో ఓ మూవీలో నటించాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓ వర్గం ఆడియన్స్ ని మాత్రమే అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ - తేజ కలిసి 'జాంబీ' కాన్సెప్ట్ తో వస్తున్నారు. స్టార్ అవుదామనుకుంటున్న తేజకు.. స్టార్ డైరెక్టర్ అవుదామనుకుంటున్న ప్రశాంత్ వర్మకి 'జాంబీ రెడ్డి' కీలకమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలుగులో రాయలసీమ వంటి హిట్ బ్యాక్ డ్రాప్ అండ్ సెంటిమెంట్ తో రాబోతున్న 'జాంబీ రెడ్డి' ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.