ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా మంచి సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో సోనాలి బింద్రే ఒకరు. ముఖ్యంగా ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు అన్ని కూడా హిట్ అయినవే. మురారి, మన్మథుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఖడ్గం ఇలా వరుస సినిమాలతో ఒకప్పుడు సోనాలి బింద్రే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ రేంజ్ లో క్రేజ్ అందుకుంది.
అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె వరుస సినిమాలతో బిజీగా కనిపించేది. కొన్నేళ్ల వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీ గా కనిపించిన సోనాలి బింద్రే ఆ తరువాత మధ్యలో హఠాత్తుగా క్యాన్సర్ బారిన పడే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కొంతకాలం పాటు ఆమె విదేశాల్లోనే ప్రత్యేకంగా క్యాన్సర్ కోసం చికిత్స తీసుకొని మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఆమె కోలుకున్న అనంతరం ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో బిజీ గా మారుతుంది.
కానీ గతంలో మాదిరిగా మాత్రం సోనాలి బింద్రే రెగ్యులర్గా సినిమాలు చేయడం లేదు. ఆమె వయసు తగ్గట్టుగా ప్రత్యేకమైన పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక రీసెంట్ గా ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సీరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది.
ఇక ఆ ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగంగా సోనాలి బింద్రే ప్రస్తుత కాలంలో సినిమాలో చేయడానికి ప్రత్యేకమైన కారణం కేవలం డబ్బు మాత్రమే అని తెలియజేసింది.
గత కొంత కాలంగా కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా అంతగా బాగో లేకపోవడంతో సోనాలి బింద్రే బాధ్యత తీసుకొని డబ్బు కోసం మాత్రమే సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడానికి ఒప్పుకున్నట్లు వివరణ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎప్పటిలానే సోనాలి బింద్రే మంచి కాన్సెప్ట్ ఉన్న కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె కొట్టిపారేసిన విషయం తెలిసిందే.