న్యాయం తప్ప మరేమి వద్దు : సుశాంత్‌ సోదరి

Update: 2020-08-14 02:30 GMT
సుశాంత్‌ మృతిపై కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో బీహార్‌ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. కేసు సీబీఐకి అప్పగించాలంటూ మొదట సుశాంత్‌ సోదరి శ్వేత సింగ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయడంతో పాటు ఆమె ప్రజలందరికి కూడా తన సోదరుడి కేసు విషయంలో పోరాటం చేయాలని కోరింది. దాంతో ఆమె కోరుకున్నట్లుగా ఇతర కుటుంబ సభ్యులు కోరుకున్నట్లుగా అభిమానులు కోరుకున్నట్లుగా కేసు సీబీఐ వరకు వెళ్లింది. ఈ సమయంలో శ్వేత సింగ్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియో ఒకటి చర్చనీయాంశం అయ్యింది.

రియా చక్రవర్తి పై సుశాంత్‌ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రివర్స్‌ గా రియా కూడా సుశాంత్‌ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. ఆమె వద్ద ఉన్న కొన్ని సాక్ష్యాలను మరియు వాట్సప్‌ స్క్రీన్‌ షాట్స్‌ ను ఆమె ఈడీ ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. సుశాంత్‌ కుటుంబ సభ్యులు ఏదో ఆశించి తనను ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ రియా ఆవేదన వ్యక్తం చేస్తుందట. ఈ విషయమై శ్వేత సింగ్‌ స్పందించింది.

సుశాంత్‌ కేసుకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశాం. మాకు న్యాయం కావాలి తప్ప అంతకు మించి మరేమి వద్దంటూ ఆమె వీడియోలో పేర్కొంది. సుశాంత్‌ మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తే చాలు. అప్పుడే ఆయన కుటుంబ సభ్యులమైన మేము మరియు అభిమానులు ప్రశాంతంగా ఉంటారని శ్వేత అన్నారు. సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు రికా చక్రవర్తి కుటుంబం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండటంతో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News