ఎంతైనా హీరొయిన్ ఇలియానా చాలా తెలివైనది. దేవదాసుతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన నటించి ఇక అవకాశాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో తెలివిగా బాలీవుడ్ లో బర్ఫీ సినిమా ద్వారా అక్కడో సూపర్ హిట్ కొట్టేసింది. మొన్న వచ్చిన అజయ్ దేవగన్ రైడ్ వరకు తన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. మోడల్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్ తో తనకున్న వ్యక్తిగత సంబంధం గురించి గాసిప్స్ ఎక్కువవుతున్న నేపధ్యంలో ఒక ప్రముఖ న్యూస్ వైర్ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనోగతాన్ని స్పష్టంగా చెప్పేసింది.తనకు ఏది గుట్టుగా దాచడం ఇష్టం ఉండదని, నేను నిజం చెప్పేస్తే గాసిప్ రాయుళ్ళకు పనేమీ ఉండదని కాని వాటికి అవకాశం ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసేసింది. ఇటీవలే తన ఇన్స్ టాగ్రామ్ పోస్ట్ లో నీబోన్ ని బెస్ట్ హబ్బిగా పేర్కొన్న ఇలియానా దీంతో పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
గత 15 ఏళ్ళుగా బాడీ డిఫార్మిక్ డిజార్డర్ తో తాను బాధ పడుతున్న మాట నిజమేనని అందుకు తానేమి సిగ్గు పడటం లేదన్న ఇలియానా అందరు సిగ్గుపడి భయపడే విషయాన్నీ తాను ధీటుగా ఎదురుకోవడానికే ఇష్టపడతానని క్లారిటీ ఇచ్చేసింది. చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకోవడం గురించి చెబుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని డబ్బులు చేసుకునే లక్ష్యం లేదు కనకే సహజంగా ఉండే పాత్రలు తనలో నటికి ఛాలెంజ్ అనిపించే పాత్రలు మాత్రమే ఎంచుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పుడున్న ట్రెండ్ లో హీరొయిన్ ని కేవలం అందచందాలు ప్రదర్శించే బొమ్మగా కాకుండా హీరోకు సమానమైన టాలెంట్ గుర్తించే పాత్రలు వస్తున్నాయని చెప్పింది.
అంతా బాగానే ఉంది కాని నిజానికి ఇలియానా గత రెండు మూడేళ్ళుగా చేస్తున్నవి జస్ట్ గ్లామర్ తరహా పాత్రలే. గత ఏడాది వచ్చిన బాద్శాహో - ఇప్పుడు వచ్చిన రైడ్ లాంటి వాటిలో తన పాత్రలు మరీ ఛాలెంజ్ అనదగ్గవి కావు. భారం వేస్తే మహిళలు సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టే స్థాయిలో ఇప్పుడున్నారని చెబుతున్న ఇలియానా మరి అలాంటి సినిమా దగ్గరలో ఏదైనా చేస్తుందేమో చూడాలి.