వర్మ.. ఆఫీసర్ డౌటే?

Update: 2018-04-25 06:47 GMT
గతంలో రామ్ గోపాల్ వర్మ లాంటి విలక్షణ దర్శకుడు ఎవరి గురించి ఎలాంటి కామెంట్స్ చేసినప్పటికీ ఆయన కామెంట్ లో అర్థం ఉండేదని చాలా మంది అనుకునేవారు. ట్విట్టర్ ప్రపంచంలో ఆయన చేసిన కామెంట్స్ ఎంతో ఆలోచింపజేసేవి. నిజమే అని చాలా మంది అనుకునే వారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని తిట్టమని శ్రీ రెడ్డికి సలహా ఇచ్చారో అప్పటి నుంచి వర్మ గుర్తింపు చాలా తగ్గిందనే చెప్పాలి. ఆయన మీద ఉన్న గౌరవం ఒక ఆకర్షణ తొలగిపోయాయి.

ఆయన ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్ సైతం అర్జీవి తీరును తప్పుబట్టారు.  అంతా ఆయన ప్లాన్ అని శ్రీ రెడ్డి ఆడియో లీక్ అవ్వడం ఆ తరువాత అర్జీవి క్షమాపణ చెప్పడం నిజంగా ఒక నాటకీయంగా సాగి ఎన్నో అనుమానాలను రేపింది. అయితే ఇప్పుడు ఆ వివాదాల కారణంగా నాగార్జున తల పెట్టుకున్నారని టాక్ వస్తోంది. ఎందుకంటే అర్జీవితో ఆయన ఆఫీసర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేసి మే 24న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి ఆఫీసర్ వస్తాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇటీవల సినీ పెద్దలు వర్మను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలానే విధంగా కామెంట్ చేశారు. ఆ విషయంపై నాగ్ స్పందించలేదు. ఎవరెలాంటి కామెంట్స్ చేస్తున్నా కూడా చాలా సైలెంట్ గా ఉంటున్నారు. తన బలంతో నాగ్ సినిమాను రిలీజ్ చేయగలడు. అలా చేస్తే ఆ తరువాత పరిస్థితి ఏమిటా అనే విషయం ఎవ్వరికి అర్థం కావడం లేదు. పైగా వర్మ తన సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా లేక వాయిదా పడుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News