ఎన్టీఆర్ మహానాయకుడుని సందిగ్దత లేకుండా సాఫీగా విడుదల చేయడం ఇష్టం లేనట్టుంది బాలయ్య టీంకు. ఇప్పటికే చాలినంత బజ్ లేక ఓపెనింగ్స్ విషయంలో బెంగ పెట్టుకున్న అభిమానులు బయ్యర్లకు ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉంది. అలాంటిదే ఈ పోస్టర్ కూడా. ఇవాళ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ టైంని ఫిక్స్ చేస్తూ కొత్తగా పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. ఇందులో వింతేమి లేదు కాని హెడ్డింగ్ లో అతి త్వరలో విడుదల అని పెట్టడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.
నిన్న వదలిన ప్రమోషనల్ మెటీరియల్ లో సినిమా 22న విడుదల అని స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఇవాళ హటాత్తుగా అతి త్వరలో అని ఎందుకు మార్చాల్సి వచ్చిందనే సందేహం అందరికి కలుగుతోంది. అయితే ఆ టీంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రం వాయిదా లాంటి ఆలోచన ఏదీ లేదని ఎందుకు త్వరలో అని పెట్టారో తెలియదని అంటున్నారు. అయితే మరో ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది బాలయ్య ఆలోచనట. నిన్న తేది ప్రకటించినప్పటికీ ట్రైలర్ రూపంలో అధికారికంగా అందులోనే పొందుపరుద్దామని అప్పుడు మనం చెప్పినట్టు అవుతుందని పంతులుతో మంచి ముహూర్తాన్ని సెట్ చేయించుకుని మరీ ఫిక్స్ చేసినట్టు తెలిసింది.
కాస్త పవర్ ఫుల్ గా అనిపించేలా కీలకమైన సన్నివేశాలతోనే ట్రైలర్ ను కట్ చేయించారట. కథానాయకుడు గాయాలు మానాలి అంటే మహానాయకుడు అద్భుతంగా ఆడి తీరాలి అనే టార్గెట్ తో బరిలో దిగుతోంది. ఇప్పుడు చూస్తే ఈ కొత్త అయోమయం. ఆరు రోజులు రిలీజ్ దగ్గరలో పెట్టుకుని ఈ డేట్ విషయంలో దోబూచులాట ఎందుకో. ఫ్యాన్స్ ని అయోమయానికి గురి చేయడం కాక మరేమిటి