ఏఎన్నార్ తెలిసినా.. ఎన్టీఆర్ తో మొదలు

Update: 2017-06-13 11:28 GMT
పాటల రచయితగా సి నారాయణ రెడ్డి ఎంతటి ప్రఖ్యాతి చెందారనే విషయం చెప్పేందుకు.. ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఆయన పాటలే తార్కాణం. అయితే.. గీత రచయితగా ఆయన ప్రస్థానం గులేబకావళి చిత్రంతో మొదలైంది. అంతకు మందే ఆయనకు పాటలు రాసేందుకు అవకాశం వచ్చినా.. ఒకట్రెండు గేయాలు రాయమని అడిగారట. కానీ మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం వస్తేనే రాయాలని భావించి మిన్నకుండిపోయారట సినారె.

ఎన్టీఆర్ తో అంతకు ముందే పరిచయం ఉండడంతో.. ఓసారి ఆయన పాటలు రాయమని అడిగినపుడు.. "మొత్తం అన్ని పాటలు అయితే రాస్తాను" అని చెప్పారట. గులేబకావళి ప్రారంభానికి ముందు పిలిచి అన్ని పాటలు రాయమని చెప్పడమే కాదు.. చెన్నైలో దిగగానే తనే వచ్చి ఇంటికి తీసుకెళ్లేవారట. పది రోజుల్లో 10 పాటలు రాయడం పూర్తయిందని చెప్పేవారు సినారె. అలాగే.. దాన వీర శూర కర్ణ చిత్రం ధుర్యోధనుడి పాత్రకు రాసిన డ్యుయెట్ 'చిత్రం భళారే విచిత్రం' తనకు ఎంతో ఇష్టమని ఎన్టీఆర్ పలుమార్లు చెప్పేవారు.

నిజానికి ఎన్టీఆర్ తో పరిచయం కంటే ముందే ఏఎన్నార్ తో సినారెకు పరిచయం ఉందట. "ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో అనే పాట ఏఎన్నార్ కు చాలా ఇష్టం. మా ఇద్దరి అభిప్రాయాలు కూడా బాగా కలుస్తాయి' అని చెప్పేవారు సినారె.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News