ఊహలు గుసగుసలాడే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ శౌర్య. లవ్ స్టొరీలను ఎంచుకుంటూనే ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త ధనం ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే ఇంకా ఈ యువ హీరో తన మార్కెట్ ను పెంచుకునే విధంగా ప్రస్తుతం ఛలో అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ సినిమాపై ఈ కుర్ర హీరో చాలా నమ్మకంగా ఉన్నాడు. అంతే కాకుండా ఎప్పుడు లేని విధంగా కొంచెం భారీగానే సినిమా ప్రమోషన్స్ చేసేలా ప్లాన్ వేసుకుంటున్నాడు. నిర్మాతలు సినిమాను కూడా భారీగానే నిర్మించారు. ఇక రీసెంట్ గా సినిమాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. పాటలో నాగ శౌర్య మంచి ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ రష్మిక మందాన్న కూడా చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కొన్ని షాట్స్ చాలా అందంగా ఉన్నాయి. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది.
బికామ్ లో ఫిజిక్స్ అనే బుక్స్ కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి సాంగ్ కొంచెం కొత్తగా ఉంది అని ఆలోచనని కల్పిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సాంగ్ ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుంటోంది. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. ఇక మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరికి ఈ సినిమా రిజల్ట్ పై చాలా కాన్ఫెడన్స్ కనిపిస్తోంది. ఈ పాటలను చూస్తుంటే అది నిజమనే అనుకోవాలి కాబోలు.
Full View