ఈ మధ్యే హాలీవుడ్ ఆల్ టైం గ్రేట్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన ‘బీఎఫ్జీ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడం జగపతి డబ్బింగ్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆ సంగతలా వదిలేస్తే మరో ప్రముఖ తెలుగు నటుడు.. ఓ హాలీవుడ్ లెజెండ్ కోసం వాయిస్ ఇచ్చాడు.. ఆ నటుడు రానా దగ్గుబాటి కాగా.. అతను వాయిస్ ఇచ్చింది టామ్ హాంక్స్ కోసం.
ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప పాత్రలు చేయడంతో పాటు తన అసామాన్యమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న టామ్ హాంక్స్.. తాజాగా ‘ఇన్ఫెర్నో’ అనే సినిమా చేశాడు. ఇందులో మన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఈ సినిమా భారతీయ భాషల్లో రిలీజవుతోంది. తెలుగులోకి కూడా అనువాదం చేస్తున్నారు.
తెలుగు వెర్షన్ కోసం రానా.. టామ్ హాంక్స్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటికే వరుసగా మూడు రోజుల పాటు ఈ డబ్బింగ్ కోసం సమయం కేటాయించాడు రానా. ఈ అనుభవం గురించి అతను చెబుతూ.. ‘‘టామ్ హాంక్స్ లెజెండరీ యాక్టర్. ఆయనకు వాయిస్ ఇవ్వడం అంటే నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తా. ఆయన చేసిన రాబర్ట్ టాంగ్ టాన్ పాత్ర నా క్రెడిట్లోకి వచ్చినందుకు గర్విస్తున్నా’’ అన్నాడు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/