తెలుగు ప్రేక్షకులకు భరత్ పరిచయమే .. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' సినిమాతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. ఆ సినిమా ఇక్కడి యూత్ కి కూడా బాగా ఎక్కేసింది. ఆ తరువాత తమిళంలో కొన్ని ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళ్లిన ఆయనకి, 'కాదల్' అనే ఒక సినిమా పడింది. ఆ సినిమానే తెలుగులో 'ప్రేమించు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ తెరపై కాకుండా మన కళ్ల ముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ సినిమా అంత సహజంగా అనిపించడంలో భరత్ ముఖ్యమైన పాత్రను పోషించాడు.
ప్రేమకోసం పిచ్చివాడిగా మారిపోయిన ఆ పాత్రలో భరత్ నటనను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ పాత్ర ద్వారా ఆయన అంత ప్రభావితం చేశాడు. ఇక ఆ తరువాత ఆయన తమిళ .. మలయాళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. మళ్లీ మురుగదాస్ సినిమాలో చేసిన ' స్పైడర్' సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ' భైరవుడు' అనే విలన్ కి బ్రదర్ గా ఆయన మెప్పించాడు. ఈ పాత్రను ఆయన ఎంతగా ఓన్ చేసుకున్నాడనేది తెరపైనే చూడాలి. ఇలా తన సహజమైన నటనతో ఆకట్టుకునే భరత్ .. 'కురుప్' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
'కురుప్' ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్. దుల్కర్ సల్మాన్ - శోభిత ధూళిపాళ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను , ఈ నెల 12వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులోను ఇదే రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో భరత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై భరత్ మాట్లాడాడు. "ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను దుల్కర్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. మంచి రోల్ కోసం సిఫార్స్ చేసినందుకు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను.
'కురుప్' చాలా ఇంట్రెస్టింగ్ గా సాగే క్రైమ్ కథ. ఈ సినిమా కోసం నేను వర్క్ చేసింది చాలా తక్కువ రోజులే. నా పోర్షన్ కి సంబంధించిన షూటింగు నాలుగైదు రోజుల్లో పూర్తయింది. ఈ కొన్ని రోజుల్లో ఈ సినిమా టీమ్ తో నేను చేసిన జర్నీని మరిచిపోలేను. ఇది తప్పకుండా దుల్కర్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ సినిమా నటుడిగా దుల్కర్ గ్రోత్ ను చెబుతుంది. ఎక్కడా కూడా ఆయన నటిస్తున్నట్టుగా మీకు అనిపించదు. ఈ సినిమా కోసం చాలామంది నటీనటులు .. సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ నెల 12వ తేదీన వివిధ భాషల్లో థియేటర్లకు వస్తుంది చూడండి .. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా దుల్కర్ కి హిట్ ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది" అని చెప్పుకొచ్చాడు.