మలయాళంలో మోహన్ లాల్ .. మమ్ముట్టి .. సురేశ్ గోపి వంటి కొంతమంది హీరోలు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మలయాళంలో ఈ తరం హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఇక్కడికి వారికి బాగా తెలుసు. తన కెరియర్ తొలినాళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి దుల్కర్ ప్రయత్నిస్తూ వచ్చాడు. 'ఉస్తాద్ హోటల్' .. 'ఓకే బంగారం' సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక 'మహానటి' సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ కూడా చేశాడు. అలాంటి దుల్కర్ .. తన తాజా చిత్రమైన 'కురుప్'ను మలయాళంతో పాటు వివిధ భాషల్లో ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నాడు.
అలా ఈ సినిమా తెలుగులోను 'కురుప్' పేరుతోనే విడుదలవుతోంది. ఈ సినిమాకి దుల్కర్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శోభిత ధూళిపాళ .. ఇంద్రజిత్ సుకుమారన్ .. పృథ్వీరాజ్ సుకుమారన్ .. టోవినో థామస్ .. సన్నీ .. భరత్ .. సురభి లక్ష్మి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఆసక్తికరమైన కథ ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకపై దుల్కర్ మాట్లాడాడు.
"అందరికీ నమస్కారం .. ఇంతకంటే తెలుగు మాట్లాడాలంటే నాకు స్క్రిప్ట్ కావలసి ఉంటుంది. ఈ సినిమా గ్లింప్స్ చూడగానే ఇది చాలా స్పెషల్ మూవీ అనే విషయం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మేము ఈ సినిమా కోసం ఎంతగా ఎఫర్ట్ పెట్టామో కూడా మీరు గ్రహించే ఉంటారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. ఈ సినిమా స్టోరీ లైన్ .. ఐడియా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అందువల్లనే ఇన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తెలుగులో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మంచి పార్ట్నర్ దొరకడం మా అదృష్టం.
హైదరాబాద్ వెళ్లాలి అనే సరికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు .. నాకు ఏదో తెలియని అనుబంధం ఉంది. సినిమాలను ఎక్కువగా ఇష్టపడేది .. ప్రేమించేది .. చూసేది తెలుగువారే. నేను చేసిన 'ఉస్తాద్ హోటల్' ను కూడా వాళ్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడమే అందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా మీరంతా నన్ను ఒక తెలుగువాడిగానే రిసీవ్ చేసుకున్న తీరు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
తెలుగువారి పట్ల గల అభిమానంతోనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక తెలుగు సినిమాను కూడా చేస్తున్నాను. 'కురుప్' సినిమా కోసం మీరంతా థియేటర్లకు వెళ్లండి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ఎక్కడా కూడా ఇది డబ్బింగ్ సినిమా అనే ఆలోచన మీకు రాదు. తెలుగు సినిమానే అనుకునేలా ఉంటుంది. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.