మణిరత్నం ఓకే బంగారంతో మనవాళ్ళకు దగ్గరై మహానటితో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం గొంతు కలిపాడు. అయితే తెలుగు వెర్షన్ కోసం కాదు లెండి. మలయాళంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పాట పాడాడు దుల్కర్. నటనతో పాటు మంచి గాత్రం ఉన్న దుల్కర్ అక్కడ బాగానే పాటలు పడతాడు. ఆ ర\కంగా అతనికి అదనపు గుర్తింపు కూడా ఉంది.
ఇప్పుడు ఈ డియర్ కామ్రేడ్ కు సింగర్ గా మారడం వల్ల విజయ్ దేవరకొండ మూవీకి అదనపు మైలేజ్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ గతంలో ఎబిసిడి-సిఐఎ-చార్లీ లాంటి సినిమాలకు పాడాడు. మ్యూజికల్ గా అవి హిట్టయ్యాయి కూడా. ఇప్పుడూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కామ్రేడ్ టీం నమ్మకం. అది ఏ పాట అనే డీటెయిల్స్ ఇంకా తెలియలేదు కాని వచ్చే నెల విడుదల కోసం డియర్ కామ్రేడ్ అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటున్నాడు.
ఇప్పటికే మూడు ఆడియో సింగిల్స్ వచ్చేశాయి. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెలలు గడుస్తున్నా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏదీ రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు దీని గురించి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ డియర్ కామ్రేడ్ ఈసారి మాత్రం పక్కానే. మైత్రితో కలిసి బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించగా భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు