టాలీవుడ్ మేకర్స్ తో పాటు స్టార్స్ లో .. స్టార్ ప్రొడ్యూసర్ లలో కరోనా భారీ మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఒకటి అర సినిమాలు మాత్రమే చేసే స్టార్ హీరోలు ఇప్పడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ షాక్ ఇస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ఇదే తరహాలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొంత మంది స్టార్ ప్రొడ్యూసర్స్ భారీ సినిమాలు చేస్తూనే మినిమమ్ బడ్జెట్ సినిమాలు.. స్మాల్ హీరోల మూవీస్ చేస్తున్నారు. బిగ్ స్టార్స్ మూవీస్ కి టైమ్ పడుతుండటంతో యంట్ హీరోలతో సినిమాలకు రెడీ అయిపోతున్నారు.
ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఓ పక్క బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తూనే స్మాల్ హీరోలతోనూ సినిమాలు చేస్తోంది. ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ గత కొంత కాలంగా యువీ క్రియేషన్స్ స్మాల్ హీరోలకు, స్మాల్ మూవీస్ కి అండగా నిలుస్తూ విభిన్నమైన కమర్షియల్ మూవీస్ ని అందిస్తోంది. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ వస్తున్న స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీమేకర్స్ కూడా తాజాగా యంగ్ హీరోలతో సినిమాలకు రెడీ అయిపోయింది.
కిరణ్ అబ్బవరం హీరోగా రెండు కోట్లకు మించిన బడ్జెట్ తో ఓ చిన్న సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే తాజాగా మరో భారీ నిర్మాత చిన్ని సినిమాలని నిర్మించడం మొదలు పెట్టారు.
ఆయనే పాన్ ఇండియా చిత్రాల ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి డైరెక్షన్ లో దానయ్య `ట్రిపుల్ ఆర్` మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ తరువాత దానయ్య బిగ్ స్టార్స్ తో భారీ సినిమాలు చేస్తూనే స్మాల్ మూవీస్ కి రెడీ అయిపోతున్పారు. ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి మీడియం రేంజ్ స్మాల్ మూవీస్ కి శ్రీకారం చుడుతున్నారు. ఓ పక్క నత నతయుడిని హీరోగా పరిచయం చేసే పనుల్లో బిజీగా వున్న ఆయన బిగ్ మూవీస్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ మీడియం రేంజ్ స్మాల్ మూవీస్ ని కూడా నిర్మించబోతున్నారు. యంట్ టాలెంట్ కి సపోర్ట్ గా నిలబోతున్నారు.
ఇప్పటికే ఇద్దరు యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. `డీజే టిల్లు` మూవీతో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న సిద్దూ జొన్నలగడ్డతో ఓ మూవీని ఇప్పటికే పట్టాలెక్కించారు. మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితోనూ మరో మూవీకి శ్రీకారం చుట్టారు. త్వరలో మరి కొంత మంది మినిమమ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా భారీ చిత్రాలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్స్ మిమినమ్ గ్యారెంటీ సినిమాలకు శ్రీకారం చుడుతుండటం టాలీవుడ్ లో శుభ పరిణామమని అంటున్నారు.