ద్వానే డగ్లస్ జాన్సన్... ఇపుడు హాలీవుడ్ లో సంచలనంగా వార్తల్లోకి వచ్చాడు. అతను వార్తలకెక్కింది వివాదాలతో కాదు, ఆదాయంతో! కేవలం నటన ఆధారంగా వచ్చిన ఆదాయాల ప్రకారం ఫోర్బ్స్ తయారుచేసిన జాబితాలో ఇతను నెం.1 గా నిలిచాడు. 850 కోట్లు కేవలం గత జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య సంపాదించాడు. అత్యధికంగా సంపాదించిన సెలబ్రిటీలతో పోర్బ్స్ విడుదల చేసిన లిస్టులో జాన్సన్ ఐదో స్థానంలో ఉన్నా కేవలం నటన ద్వారా మాత్రమే వచ్చిన ఆదాయం పరంగా చూసినపుడు జాన్సన్ నెం.1 నిలిచి అందరినీ ఆశ్యర్యపరిచారు. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే ఈసారి అతని ఆదాయం రెట్టింపయ్యింది.
ఈస్థాయిలో అతని ఆదాయం పెరగడానికి కారణం గత ఏడాది విడుదల అయిన బ్లాక్ బస్టర్ మూవీ జుమాంజి..వెల్ కం టు ది జంగిల్ సృష్టించిన సంచలనాలే. ఆ సినిమా అరుదైన రికార్డలను సృష్టించడంతో పాటు ద్వానే జాన్సన్ కు కోట్లు కురిపించింది. ప్రస్తుతం అతను స్కై స్క్రేపర్ సినిమాలో నటిస్తున్నాడు.
దీనిపై ఆశ్యర్యానందాలతో స్పందించారు జాన్సన్.. ఆయన ఏం ట్వీట్ చేశారంటే... *ఇది ఊహించలేదు. నాకు హార్వర్డ్ ఎంబీయే లేకపోయినా అనేక అపజయాలతో నాలో వ్యాపార నిపుణత చాలా పెరిగిందన్నమాట. నాకు ఒక్కరే ఒక్కరు బాస్ ఉన్నారు. అదే ప్రపంచం.. అందులో ఉన్న ప్రజలు. నేను కేవలం ఏడు డాలర్లతో జీవితం ప్రారంభించిన అతి సామాన్యుడిని. ఇపుడు ఏడాదికి 124 మిలియన్ డాలర్లు సంపాదించానంటే నాకే విస్మయంగా ఉంది. అయితే, ఇంకా నా ఆకలి తీరలేదు* అని వ్యాఖ్యానించారు.