తమిళం నుంచి మూల కథ మాత్రమే తీసుకున్నాం.. చాలా చాలా మార్చేశాం అని చెప్పుకున్నారు ‘డైనమైట్’ సినిమా గురించి మంచు విష్ణు, దేవా కట్టా. కానీ తీరా సినిమా చూస్తే అంత గొప్ప మార్పులేమీ కనిపించలేదు. ‘అరిమా నంబి’ నుంచి దాదాపు 80 శాతం దించేశారు. చేసిన మార్పులు చాలా చిన్నవి. హీరోయిన్ తో కలిసి హీరో ఆమె ఫ్లాట్ కు వెళ్లానికి ముందు పావుగంట మాత్రమే ప్రధానంగా చేసిన మార్పు. తమిళంలో ఈ పావు గంట ఓ పబ్బులో గడుస్తుంది. అక్కడే ఓ సాంగ్ ఉంటుంది. దాని తర్వాత హీరో హీరోయిన్ కలుస్తారు. అక్కడి నుంచి హీరోయిన్ ఫ్లాట్ కి బయల్దేరతారు. ఐతే తెలుగులో ఓపెన్ ఏరియాలో హీరో హీరోయిన్ కలుస్తారు. ఆ తర్వాత డేట్ కోసం ఓ రెస్టారెంటుకి వెళ్తారు. ఆ పావు గంట గడిచాక మిగతా సినిమా అంతా డిట్టో తమిళం నుంచే దించేశారు.
మధ్యలో యాక్షన్ సన్నివేశాల లెంగ్త్ కొంచెం పెరిగింది. చివర్లో విలన్ని హీరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లే సన్నివేశం కూడా కొంచె మార్చారు. అంతకుమించి మార్పులేమీ లేవు. షాట్స్, ఫ్రేమ్స్ అన్నీ డిట్టో దించేశారు. తనకసలు తెలుగులో మళ్లీ విలన్ క్యారెక్టర్లో నటించే ఉద్దేశం లేదని.. ఐతే తెలుగు వెర్షన్ విషయంలో చేసిన మార్పులు చూసి.. ఒప్పేసుకున్నానని చెప్పాడు జేడీ చక్రవర్తి. ఐతే అతడి క్యారెక్టర్ విషయంలో అయితే 1 పర్సంట్ కూడా మార్పు లేదు. లొకేషన్, స్సింగ్, ఎక్స్ ప్రెషన్స్, డైలాగుల దగ్గర్నుంచి అన్నీ అలాగే దించేశారు. తమిళ వెర్షన్ కు చేసిన మార్పులు నెగెటివ్ అయ్యాయే తప్ప.. మాతృకను మెరుగు పరిచేలా లేవు. యాక్షన్ సన్నివేశాల డోస్ పెంచడం సినిమాకు చేటే చేసింది. పాటలు కూడా సినిమాకు అడ్డయ్యాయి. ఈ ఎక్స్ ట్రాల్ని పక్కన పెడితే ‘డైనమైట్’ డీసెంట్ థ్రిల్లరే అని చెప్పాలి.