శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాపై ED విచార‌ణ‌

Update: 2022-05-19 15:28 GMT
శిల్పాశెట్టి భ‌ర్త.. వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాజ్ కుంద్రాతో పాటు మరికొంతమందిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వారిని త్వరలో విచారణకు పిలుస్తామని ఈడీ వెల్ల‌డించింది. రాజ్ కుంద్రా స‌హా ప‌లువురు అశ్లీల వీడియోల యాప్ లను నడుపుతున్నారని ముంబై పోలీసుల ఎఫ్‌.ఐ.ఆర్ ఆధారంగా ఈ కేసులో విచార‌ణ సాగుతోంది. విదేశాల్లో పనిచేస్తున్న వారితో సహా రాజ్ కుద్ర స‌హా స‌హ‌చ‌రుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ వివరాలు సేకరించిన తర్వాత గత వారం కేసు నమోదు చేసింది. మరికొద్ది రోజుల్లో వీరిని విచారణకు పిలుస్తారని తెలుస్తోంది.

ఫిబ్రవరి 2021లో పోలీసులు మాద్ ఐలాండ్ లోని ఒక బంగ్లాపై దాడి చేసి పోర్న్ ఫిల్మ్ మేకింగ్ రాకెట్ ను ఛేదించారు. కేసు దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు దీని వెన‌క‌ కుంద్రా ఉన్నార‌ని వెల్ల‌డించారు. అతన్ని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. దర్యాప్తు ప్రేరేపించబడిన అవాస్త‌వ‌మ‌ని.. ఆ నేరంతో త‌న‌ను లింక‌ప్ చేసార‌ని తాను చేసాన‌న‌డానికి స్పష్టమైన రుజువు లేదని కుంద్రా చెప్పారు.

రాజ్‌ కుంద్రా డబ్బు కోసం సోషల్‌ మీడియా యాప్ లో పోర్న్‌ వీడియోలను అప్ లోడ్‌ చేశాడని ఆరోపించారు. బ్రిటన్ కు చెందిన కెన్రిన్ లో కుంద్రాకు వాటా ఉందని పోర్న్ మెటీరియల్ ఉత్పత్తి అలాగే పంపిణీలో పాలుపంచుకున్నాడని పోలీసులు ఆరోపించారు. అతని బావ ప్రదీప్ బక్షి కెన్రిన్ చైర్మన్. హాట్ షాట్స్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ అనే మొబైల్ యాప్ తో కలిసి పనిచేశారు. దీనిని కెన్రిన్ అభివృద్ధి చేశారు. కుంద్రా తన వయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి బ్రిటిష్ కార్యకలాపాలను నియంత్రించినట్లు బాలీవుడ్ మీడియాలో క‌థనాలు వ‌చ్చాయి.

ఇదీ అత‌డిపై న‌మోదైన కేసు

రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి మరియు పంపిణీ కేసులో విచారణకు సంబంధించి జూలైలో అరెస్టయ్యాడు. ముంబైలోని ఆయన కార్యాలయాలపై ముంబై పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 21న రాజ్ జైలు నుంచి బయటకు వచ్చాడు. పోలీసులు 1500 పేజీల అనుబంధ ఛార్జిషీట్ లో ఈ కేసులో కుంద్రా ``ప్రధాన సహాయకుడు`` అని పేర్కొన్నారు. అతను ఇతర నిందితులతో కలిసి సినీ పరిశ్రమలో అవ‌కాశాల కోసం పోరాడుతున్న యువతులను అసభ్యకరమైన మార్గాల్లో చిత్రీకరించి వాటిని యాప్ ల పేరుతో మార్కెటింగ్ చేసి దోపిడీకి పాల్పడ్డాడు. అయితే ఈ ఆరోప‌ణ‌ల్ని రాజ్ కుంద్రా ఖండిస్తున్నారు. ఈ కేసులో తనను బలిపశువుగా మారుస్తున్నారని.. మొత్తం అనుబంధ ఛార్జిషీట్ లో తనపై ఒక్క ఆరోపణ కూడా లేదని రాజ్ కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు.

శిల్పా శెట్టి ఎంత ట్రై చేసినా కానీ..!

రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత శిల్పాశెట్టి ఒక ప్రకటనలో  ఏమ‌న్నారంటే.. నేను ఇంకా వ్యాఖ్యానించలేదు. ఈ కేసు విచార‌ణ‌లో ఉన్నందున‌ అలా చేయను. కాబట్టి దయచేసి తప్పుడు కొటేష‌న్ల‌ను రాజ్ పై ఆపాదించడం ఆపండి. నా తత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాను.  “ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.. ఎప్పుడూ వివరించవద్దు” అని మీడియాని కోరింది శిల్పా. నేను చెప్పేది ఒక్కటే.. ఇది కొనసాగుతున్న విచారణ కాబట్టి నాకు ముంబై పోలీసులు అలాగే భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒక కుటుంబంగా మేము అందుబాటులో ఉన్న అన్నింటిని ఆశ్రయిస్తున్నాము. చట్టపరమైన పరిష్కారాలు వెతుకుతున్నాం.

కానీ అప్పటి వరకు నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించవలసిందిగా నేను మిమ్మల్ని అభ్య‌ర్థిస్తున్నాను. ప్రత్యేకించి ఒక తల్లిగా కోరుతున్నాను నిజానిజాల‌ను ధృవీకరించకుండా సగం వండిన‌ సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు .. నేను ఎవరినీ ఎప్పుడూ నిరాశపరచలేదు. కాబట్టి ముఖ్యంగా నా కుటుంబ గోప్యతపై నా హక్కును గౌరవించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. అని అన్నారు. కానీ ఇప్పుడు మ‌రోసారి ఈడీ విచార‌ణ సాగుతుండ‌డంతో రాజ్  ఆర్థిక వ్య‌వ‌హారాల‌పైనా వ్యాపారాల పైనా పూర్తి స్థాయిలో ఆరాలు మొద‌లైన‌ట్టే.
Tags:    

Similar News