ఈషా భారం ఈసారి దెయ్యం మీదే!

Update: 2019-03-28 05:23 GMT
అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా రూట్ మారుస్తోంది. ఇప్పటివరకూ రెగ్యులర్ లవ్ స్టోరీస్ ను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగిన వరంగల్ బ్యూటీ ఈషా తన కెరీర్ లో మంచి బ్రేక్ కోసం మొదటిసారిగా ఒక హారర్ ఫిలిం కు నల్లజెండా ఊపిందని సమాచారం.  ఈ థ్రిల్లర్ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తాడట.

'టాటా బిర్లా మధ్యలో లైలా'.. 'యమగోల మళ్ళీ మొదలైంది'.. 'ఢమరుకం' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరెడ్డి ఈషా కోసం ఒక మంచి కథ ను రెడీ చేశాడట. నిజానికి  నాగ చైతన్యతో ఒక సినిమా చేసేందుకు శ్రీనివాస రెడ్డి చాలాకాలం ప్రయత్నించినా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఒక హారర్ కథతో ఈషాను సంప్రదించాడట. కథ నచ్చడంతో ఈషా వెంటనే ఒకే చెప్పిందట.   నటన పరంగా.. గ్లామర్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నా ఈషా ఇంకా మంచి బ్రేక్ రాలేదు.  ఈషా కెరీర్లో 'అమీ తుమీ' లాంటి హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో నెక్స్ట్ లీగ్ కు చేరలేకపోయింది. ఈసారి మాత్రం హారర్  థ్రిల్లర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తానని నమ్మకంగా ఉందట.

హారర్ చిత్రాల ద్వారా భారీ గుర్తింపు సాధించిన వారిలో అనుష్క.. నయనతార వంటి టాప్ లీగ్ హీరోయిన్లు ఉన్నారు.  నయన్ అయితే దెయ్యం సినిమాలకు తమిళంలో కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. మరి వీరి బాటలో ఈషా కూడా తన సత్తా చాటుతుందా లేక ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు చేసిన  హారర్ సినిమాల లిస్టులో ఈ సినిమా కూడా చేరుతుందా అనేది వేచి చూడాలి.  
    

Tags:    

Similar News