చినుగుల జీన్స్ లో ఇషారెబ్బా మైండ్ బ్లాక్ విన్యాసం

Update: 2021-04-17 04:30 GMT
తెలుగ‌మ్మాయ్ ఇషారెబ్బా సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు. ఈ భామ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. ఇషా ఓవైపు క్రేజీ సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకుంటూనే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తున్నారు.

ఇంత‌కుముందు చీర‌లో ఇషా రెబ్బా ట్రీట్ వైర‌ల్ అయ్యింది. ఇన్ స్టాలో మేకప్ లెస్ ఫోటోషూట్ ఆక‌ర్షించింది. తాజాగా ఇషా చినుగుల జీన్స్ లో స్పెష‌ల్ లుక్ తో క‌నిపిస్తోంది. అలా రెడ్ క‌ల‌ర్ సోఫా సెట్ లో ఇషా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోగా చినుగుల జీన్స్ ప్ర‌త్యేక‌త ఆవిష్కృత‌మైంది. ఆ క‌ళ్ల‌కు బ్రౌన్ గ్లాసెస్ ని ఇషా ధ‌రించింది. ఈ లుక్ సంథింగ్ హాట్ అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని షేర్ చేస్తున్నారు.

ఇషా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఇటీవ‌లే పిట్ట‌క‌థ‌లు అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. ఈ సిరీస్ లో ఇషా పాత్ర‌కు పేరొచ్చింది. త్వ‌ర‌లో రిలీజ్ కి రానున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లోనూ ఇషా ఓ కీల‌క భూమిక‌ను పోషిస్తోంది. త‌మిళంలో ఆయిర‌మ్ జేన్మ‌గ‌ల్ అనే చిత్రంలోనూ ఇషా న‌టిస్తోంది.
Tags:    

Similar News