దిశాకు సీకే .. ఇషాకు పెపే.. బావుంది వ‌రుస‌!

Update: 2022-03-05 16:30 GMT
తెలుగ‌మ్మాయ్ ఇషారెబ్బా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మోడ‌ల్ కం న‌టిగా అందాల రాణిగా సుప‌రిచిత‌మైన ఈ బ్యూటీ ఇటీవ‌లి కాలంలో హాట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతూ సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇషారెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గ‌త కొంత‌కాలంగా ఇషా రెబ్బా వ‌రుస‌గా బ్రాండ్లకు ప్ర‌మోష‌న్ చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది. ఇక సినిమాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తున్నా త‌న ప్ర‌తిభ‌కు త‌గ్గ పాత్ర‌ల‌ల్లో ఛాన్సులందుకుని వండ‌ర్స్ చేయాల‌నుకున్నా వీలు ప‌డ‌డం లేదు. ఇటీవ‌లే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో ఇషా రెబ్బా పాత్ర ప‌రిమితం. ఇక ఈ అమ్మ‌డు అటు త‌మిళంలోనూ అవ‌కాశాలు అందుకుంటున్నా ఇంకా సినిమాలేవీ విడుద‌ల కాలేదు.

రెండేళ్లుగా క‌రోనా తీవ్ర ఆటంకాల్ని క‌లిగించ‌డంతో రెవెన్యూ కూడా ఆశించిన తీరుగా లేదు. కార‌ణం ఏదైనా ఇప్పుడు ప్ర‌ముఖ బ్రాండ్లు ఇషాకు చ‌క్క‌ని రెమ్యున‌రేష‌న్ ని అందిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌ఖ్యాత పెపే బ్రాండ్ కి అంబాసిడ‌ర్ గా కుదురుకున్న ఈ బ్యూటీ బాడీ హ‌గ్ దుస్తుల‌తో యూత్ మ‌తులు చెద‌ర‌గొడుతోంది.

అన్న‌ట్టు పెపేతో ఇషా డీల్ ఏ మేర‌కు కుదిరిందో ఏమిటో లీకులిస్తుందేమో చూడాలి. దిశా ప‌టానీ సీకేకు ప్ర‌చారం చేసిన‌ట్టు తెలుగ‌మ్మాయ్ పెపేకి ప్ర‌చారం చేస్తోంద‌న్న‌మాట‌.




Tags:    

Similar News