మాస్ యాక్షన్ కథాంశాల్ని తెరకెక్కించడంలో బోయపాటి పనితనం గురించి చెప్పాల్సిన పనే లేదు. తన సినిమాల్లో భారీతనం నిండిన హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మైండ్ బ్లాక్ చేయడం చాలా కామన్. ఫ్యామిలీ ఎలిమెంట్స్ సెంటిమెంట్ ని జోడించి కలర్ ఫుల్ ఫ్రేముల్ని డిజైన్ చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి.
తాజా సమాచారం మేరకు `అఖండ`లో ఫైట్స్ ని గగుర్పొడిచే విన్యాసాలతో తెరకెక్కించారని తెలుస్తోంది. బాలయ్య ను సింహా- లెజెండ్ లో ఎంత పవర్ ఫుల్ గా చూపించారో అంతకుమించి చూపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి చాలా కాలం తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఎంతో కేర్ ఫుల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లేని మాస్ యాక్షన్ అంశాలతో గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దారని లీకులు అందాయి.
ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది ఫైట్స్ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో డైరెక్టర్ బోయపాటి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంటర్వెల్ బ్లాక్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని తెలిసింది. ప్రతి పోరాటాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో రూపకల్పన చేసేందుకు బోయపాటి ఫైట్ కొరియోగ్రాఫర్లకు ఇన్ పుట్స్ అందించారట. బాలయ్య అభిమానులకు విజువల్ ఫీస్ట్ ని అందించడమే ధ్యేయంగా ఆయన ప్రతిదీ డిజైన్ చేశారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రగ్య అందచందాల ఎలివేషన్ లోనూ బోయపాటి బృందం ఎక్కడా తగ్గలేదని తెలిసింది. గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలు ఓవైపు.. ప్రగ్యతో బాలయ్య రొమాన్స్ ఇంకోవైపు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయట.
బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాలకు శ్రీకారం
నటసింహా నందమూరి బాలకృష్ణ 60 ప్లస్ ఏజ్ లోనూ నేటితరం హీరోలతో పోటీపడుతూ భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నారు. బోయపాటితో అఖండ చిత్రీకరణ పూర్తవ్వగానే గోపిచంద్ మలినేనితో సినిమా మొదలవుతుంది. ఇది బాలయ్య నటించే 107వ సినిమా. తదుపరి బాలయ్య 108వ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ అవుతోంది . `పటాస్`- `ఎఫ్-2`- `సరిలేరు నీకెవ్వురు` చిత్రాలతో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
బాలయ్య మార్క్ మాస్ అంశాలున్న కథను ఎంచుకుని తనదైన కామెడీ ఎలిమెంట్స్ ని హైలైట్ చేస్తూ అనీల్ రావిపూడి సరికొత్త ఎంటర్ టైనర్ ని రూపొందిస్తారని తెలిసింది. బాలకృష్ణ- అనీల్ తో సినిమాని సాహు గారపాటి- హరీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. `పైసా వసూల్` తర్వాత పూరి కూడా ఎన్బీకేతో మరో సినిమా చేయాల్సి ఉంది. పూరి ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని ప్రచారమవుతోంది. ఎన్.బి.కె 109 మాత్రం పైసా వసూల్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఉంటుందని ఇంతకుముందు బాలయ్య కన్ఫామ్ చేశారు. ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్లోనూ బాలయ్య నటిస్తారు. అందులో మోక్షజ్ఞ కథానాయకుడు కాగా బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. బహుశా ఈ చిత్రం మోక్షజ్ఞకు మొదటి చిత్రం కాగా.. ఎన్బీకే 110వ చిత్రం అవుతుంది. ఆదిత్య 369 సీక్వెల్ కి దర్శకుడిని ఫైనల్ చేయాల్సి ఉంది. గోపిచంద్ మలినేని- అనీల్ రావిపూడి- పూరి తర్వాత ఓ సీనియర్ దర్శకుడికి కూడా బాలయ్య ఓకే చెప్పారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. దానిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇవన్నీ రొటీన్ కి భిన్నమైన కథాంశాలతో రూపొందనున్నాయని తెలుస్తోంది.