మన వాళ్ల గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు. వేరే వాళ్లు వాళ్లను కొనియాడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అది మనకు గర్వకారణంగా అనిపిస్తుంది. తెలుగు వారు ఆరాధ్య దైవంగా కొలిచే దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గొప్పదనం గురించి మాట్లాడమంటే తీవ్ర ఉద్వేగంతో ఆయన గురించి కథలు కథలుగా చెప్పేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉంటారు.
కానీ ఒక బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గురంచి ఒక పాపులర్ హిందీ టీవీ షోలో మాట్లాడడం ఆయన అభిమానులకు అమితానందాన్నిస్తోంది. ఆ నటుడు ఎవరో కాదు.. జితేంద్ర. హిందీలో సూపర్ హిట్ ప్రోగ్రాం అయిన కపిల్ శర్మ కామెడీ షోకు తాజాగా జితేంద్ర అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.
మద్రాస్‌లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కల్ట్ స్టేటస్ ఉన్న ఐకాన్స్ అని.. వారి స్టార్ డమ్ చాలా గొప్పదని జితేంద్ర చెప్పారు.
ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయన సమయపాలన గురించి కొనియాడారు.
ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకే లేచి యోగా, పూజా కార్యక్రమాలు ముగించుకుని ఐదు గంటలకు సెట్‌కు వచ్చేవారని.. రెండు గంటల పాటు శ్రీ కష్ణుడి పాత్ర కోసం మేకప్ వేసుకునేవారని.. ఉదయం 7 గంటల కల్లా మేకప్‌తో సెట్లో రెడీగా ఉండేవారని.. ఇలాంటి సమయ పాలన అందరికీ సాధ్యం కాదని జితేంద్ర పేర్కొన్నారు.
ఇక శ్రీకృష్ణుడు సహా పురాణ పాత్రలను ఎన్టీఆర్ గొప్పగా పోషించేవారని జితేంద్ర అన్నారు. ఎన్టీఆర్ సమయ పాలన, నిబద్ధత గురించి మన వాళ్లు కూడా చాలామంది చెబతుంటారు కానీ.. ఒక బాలీవుడ్ లెజెండరీ నటుడు ఇలా ఆయన్ని కొనియాడడం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.