పవన్ లవర్ కి గంట ముద్దెట్టిన హీరో

Update: 2016-01-21 15:30 GMT
మన దేశంలో ఇప్పుడు లిప్ లాక్ లు బాగా కామన్ అయిపోయాయి. టాలీవుడ్ లో ఇంకా పెదాలకు పెదాలు ఆనించడాన్నే లిప్ లాక్ అని చెప్పేసుకుంటున్నారు కానీ, బాలీవుడ్ ఈ స్టేజ్ ని ఎప్పుడో దాటేసింది. నోట్లో నోరెట్టుకుని అందినంత మేర జుర్రేసుకుంటున్నారు. ఇలాంటి ముద్దు సీన్ల విషయంలో అందరినీ మించినోడు ఇమ్రాన్ హష్మీ. ముద్దుల వీరుడిగా ఇతగాడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

ఇమ్రాన్ తో ముద్దులు పెట్టించుకున్నవాళ్లు పెద్ద హీరోయిన్లు అవుతారనే సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే ఇమ్రాన్ హష్మీతో ఎన్ని ముద్దులకైనా, ఎంత సేపు ముద్దు పెట్టించుకోవడానికి అయినా, హీరోయిన్స్ సై అంటుంటారు. ప్రస్తుతం ఈ కిస్సింగ్ స్టార్ విక్రమ్ భట్ డైరెక్షన్ లో రాజ్4 చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కృతి కర్బందా చేస్తోంది. తీన్ మార్ లో పవన్ కి లవర్ కి గాను, రీసెంట్ గా బ్రూస్ లీలో రామ్ చరణ్ కి అక్కగాను నటించింది ఈ భామ. కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఉన్న కృతి.. ఇప్పుడు రాజ్4తో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది.

రాజ్4 షూటింగ్ లో భాగంగా ఓ లిప్ లాక్ సీన్ పర్ఫెక్ట్ రావడానికి బోలెడు రీటేక్ లు చేయాల్సి వచ్చిందట. గంటకు పైగా కృతి కర్బందాకు ముద్దు పెట్టాడట ఇమ్రాన్ హష్మీ. ఇదంతా చెప్పింది ఎవరో కాదు. కృతికర్బందానే స్వయంగా చెప్పుకొచ్చింది. ఇమ్రాన్ తో నిమిషాల పాటు ముద్దులు పెట్టించుకున్నవాళ్లే పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిపోతే.. మరిప్పుడు గంటలపాటు ముద్దు పెట్టించుకున్న కృతి కర్బందా ఇంకా పెద్ద స్టార్ అయిపోతుందేమో!
Tags:    

Similar News