వామ్మో... పాట‌లో బూతు ప‌దాలు

Update: 2018-03-09 10:33 GMT
ఎలాంటి ఆర్భాటం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతాడు శ్రీ విష్ణు. అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు సినిమా అత‌నికి మంచి పేరే తెప్పింది. అలాగే ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమాలో రామ్ స్నేహితుడిగా... ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఆ సినిమా కూడా బాగుంద‌న్న టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు నీది నాది ఒకే క‌థ సినిమాలో న‌టిస్తున్నాడు. అందులోని ఒక పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ పాట విన్న‌వాళ్లు వామ్మో అని నోరెళ్లబెట్టారు.

పాట వింటే నోరెళ్ల బెట్ట‌డం ఎందుకు? అనుకోవ‌చ్చు. మ‌రి ఆ పాట‌లో వాడిన రెండు ప‌దాలు అలా ఉన్నాయి మ‌రి. బూతు పంచ్‌ లు... బూతు డైలాగులే అనుకుంటే.. ఇదిగో ఇప్పుడు బూతు పాట‌లు కూడా వ‌చ్చేస్తున్నాయ్. శ్రీ విష్ణు సినిమా కోసం శివ కాస‌ర్త ఓ పాట రాశాడు. యూత్ కు బాగా న‌చ్చేలా... రాశాడు. కానీ ఆయన వాడిన బూతు ప‌దాలే చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. రెండు చోట్ల విన‌కూడ‌ని... మాట్లాడ‌కూడ‌ని  ప‌దాలు వాడారు. ఇంత‌గా బ‌రితెగించి రాయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది. ‘చావదెXX’ అనే ప‌దం పాట‌లో వినిపించింది. అలాగే fuXX అనే బూతు కూడా ఓ చోట ఉంది. మ‌రి సెన్సార్ వాళ్లు వీటికి క‌త్తెర వేస్తారో.. ఫ్లోలో ఆ ప‌దాలు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతారో!!
 
పాట‌లో ఆ రెండూ ప‌దాలు కాకుండా... మిగ‌తా అంతా క్యాచీ అనిపిస్తుంది. యూత్‌ కి బాగా క‌నెక్ట్ అయిపోతుంది ఈ పాట‌. వేణు ఊడుగుల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా...  బిచ్చ‌గాడు సినిమాలో హీరోయిన్ సట్నా టిటూస్ ఫిమేట్ లీడ్‌గా క‌నిపించ‌బోతోంది. ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడిగా శ్రీవిష్ణు క‌నిపించ‌బోతున్నాడు. ఆరన్‌ మీడియా వర్స్క్‌ పతాకంపై ప్రశాంతి - కృష్ణ విజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా - హీరో నారా రోహిత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Full View
Tags:    

Similar News