ఎంత మంచి వాడవురా.. గత జూలైలోనే టైటిల్ ని ప్రకటించారు. ఈ టైటిల్ కి తగ్గట్టే కళ్యాణ్ రామ్ చాలా మంచి వాడిగానే కనిపిస్తున్నారు తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తుంటే. ముఖ్యంగా ఆ మేకోవర్ తో కళ్లు తిప్పుకోనివ్వడం లేదంటే నమ్మండి. మునుపటితో పోలిస్తే హీరోయిక్ లుక్ పరంగా చాలా మార్పు కనిపిస్తోంది. ప్రతి సినిమాకి ఎంతో పరిణతి చెందిన నటుడిగా ఎదుగుతున్న కళ్యాణ్ రామ్ తాజా చిత్రంతో మరో లెవల్ కి వెళుతున్నాడా? అనిపిస్తోంది. హెయిర్ కట్ నుంచి.. పెర్ఫెక్ట్ ఫిట్ గా తీర్చిదిద్దిన ఆ బాడీ లాంగ్వేజ్ ఆకర్షిస్తోంది. తీక్షణమైన ఆ చూపు .. నడక తీరు.. చొక్కా మడతపెడుతున్న స్టైల్.. ప్రతిదీ కొత్తగానే ఉంది. కాస్త రొటీన్ కి భిన్నంగానే ఈ మేకోవర్ కనిపించడం ఆసక్తికరం. బ్యాక్ గ్రౌండ్ ని బట్టి మిడిల్ క్లాస్ కి చెందిన మంచి కుర్రాడిగా కనిపిస్తున్నాడని అనిపిస్తోంది.
ఈ చిత్రంలో మెహరీన్ కథానాయిక. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్ గుప్త- సుభాష్ గుప్త నిర్మాతలు. తాజాగా ఫస్ట్ లుక్ తో ప్రచార బరిలోకొచ్చారు. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ బ్యానర్ కి తొలి ప్రయత్నం కావడంత ప్రతిష్ఠాత్మకంగా నే నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు.
జులై 31న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించిన ఈ సినిమా మెజారిటీ చిత్రీకరణ పూర్తయింది. తణుకు- రాజమండ్రి- హైదరాబాద్- చిక్ మంగుళూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. గోపీసుందర్ స్వరాలు చిత్రానికి ప్లస్ కానున్నాయి. సతీష్ వేగేష్న తెరకెక్కించిన గత బ్లాక్ బస్టర్ `శతమానం భవతి` తరహాలో మిడిల్ క్లాస్ కష్టసుఖాలు.. ప్రేమకథ.. సెంటిమెంట్ వగైరా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.