నోరు జారింది... క్షమాపణ చెప్పింది

Update: 2019-01-29 01:30 GMT
బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్త ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మీడియాలో నలుగుతూనే ఉంటుంది. గతంలో పలు సార్లు సోషల్‌ మీడియాలో ఈమె చేసిన పోస్ట్‌ ల కారణంగా వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఈమె నోటి దురుసుతనంతో మీడియాలో నిలిచింది. సోషల్‌ మీడియాలో ఈమె కావాలని అందో లేదంటే పొరపాటున అందో కాని ఈమె అన్న ఒక మాట వివాదాస్పదం అయ్యింది. దాంతో క్షమాపణలు చెప్పి - దాన్ని డిలీట్‌ చేసినా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇషా గుప్త వివాదం ప్రస్తుతం బాలీవుడ్‌ లో కూడా చర్చనీయాంశం అయ్యింది.

ఇషా తన స్నేహితురాలితో సోషల్‌ మీడియా వేదికగా చాట్‌ చేస్తున్న సమయంలో ఒక నైజీరియర్‌ ఫుట్‌ బాల్‌ క్రీడాకారుడి గురించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది. అతడిని చూస్తుంటే గొరిల్లాలా ఉన్నాడు. అసలు అతడిని గ్రౌండ్‌ లోకి ఎందుకు రాణిస్తున్నారో అర్థం కావడం లేదు. అతడిని బెంచ్‌ కే పరిమితం చేయాలంటూ వ్యాఖ్యలు చేసింది. ఫుట్‌ బాల్‌ క్రీడాకారుడిని గొరిల్లా అంటూ విమర్శించడంతో క్రీడాభిమానులు ఆమెపై ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. అతడిని గొరిల్లా అంటూ సంబోధించడం జాతి వివక్ష వ్యాఖ్యల కిందికి వస్తాయంటూ సోషల్‌ మీడియాలో జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మీడియాలో కూడా ఇషా గుప్త వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో క్షమాపణ చెప్పింది. తాను ఫ్రస్టేషన్‌ లో ఉండి ఆ వ్యాఖ్యలు చేశాను - ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ చూస్తున్నప్పుడు కాస్త డిస్ట్రబ్‌ అయ్యానని - అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చింది. అయినా కూడా వివాదం చల్లారలేదు. తాజాగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన ఇషా గుప్త ఆకట్టుకోలేక పోయింది. బాలీవుడ్‌ లో ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చేసిన వ్యాఖ్యలు కెరీర్‌ కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకే క్షమాపణ చెప్పింది.
Tags:    

Similar News