ఫోటో స్టోరి: మ‌రో ఆట‌మ్‌ బ్రాంబు!

Update: 2018-11-28 14:30 GMT
బాంబ్ మీద బ్రాంబ్ విసురుతున్నారు. రోజుకో బ్రాంబ్ ఎలా పుట్టుకొస్తోందో కానీ - బ్రాంబోయ్ అనే రేంజులో విరుచుకుప‌డుతున్నారు. ఇన్‌ స్టాగ్ర‌మ్.. ట్విట్ట‌ర్.. ఎఫ్‌ బీ కాదేదీ `బ్రాం`బుల‌కన‌ర్హం అన్న చందంగా ల‌ల‌నామ‌ణులు ఓ రేంజులో జ‌బ్బ‌లు చ‌రుచుకుని మ‌రీ బ్రా ఫోటోషూట్ల‌లో పాల్గొంటూ అగ్గి రాజేస్తున్నారు. ఇలాంటి లోదుస్తుల ప్ర‌చారంలో అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో ఉండే లేడీ బ్రాంబ్ ఇషా గుప్తా. దిశా ప‌టానీ - ప్ర‌గ్యా జైశ్వాల్ వీళ్లంతా ఆవిడ‌కు చెల్లెళ్ల వ‌రుస ఈ విద్య‌లో.

అందాల పోటీల నుంచి రంగుల ప్ర‌పంచంలోకి వ‌చ్చిన ఈ చిట్టి గువ్వ‌లో ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు పోక‌డ‌ల‌న్నీ ఇంకిపోయి ఏనాడో అయ్యింది. ఆ స్కిల్స్ అన్నిటినీ వీలున్న‌ప్పుడ‌ల్లా బ‌య‌ట‌కు తీస్తూ ఇలా కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు పుట్టించ‌డం అల‌వాటు వ్యాప‌కంగా మారింది. గ‌త కొంత‌కాలంగా ఇదే వ‌రుస‌. గుర్తొచ్చినా.. గుర్తు రాక‌పోయినా అదే వ‌రుస‌. లేటెస్ట్ గా వైట్ అండ్ వైట్ ఇన్న‌ర్‌ వేర్ లుక్‌ తో మ‌రోసారి అంత‌ర్జాలంపై విరుచుకుప‌డింది ఇషా. ఇన్‌ స్టాలో ఈ ఫోటోల్ని ఇలా అప్‌ లోడ్ చేసిందో లేదో అలా యూత్‌ లో జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.

అయినా ఆ మాత్రం వేడి పెంచ‌క‌పోతే ఈరోజుల్లో ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అందుకే ఈ భామ మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలా విరుచుకుప‌డుతూనే ఉంది. గ‌త కొంత‌కాలంగా ఇషా ఇన్‌ స్టాని ప‌రిశీలిస్తే ఇలాంటి వేడెక్కించే ఫోటోల‌కు కొదవే లేదు. 2007లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న‌ది మొద‌లు ఈ అమ్మ‌డి ఆట మొద‌లైంది. ప‌లు టాప్ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా భారీ ఆదాయం ఆర్జిస్తూనే పెద్ద తెర‌పైనా జూలు విదిల్చింది. 2012 లో క‌థానాయిక‌గా మొద‌లై - కేవ‌లం ఐదారేళ్ల‌లోనే క్రేజీ సినిమాల్లో న‌టించి మెప్పించింది. ఇప్ప‌టికిప్పుడు బాలీవుడ్‌ లో భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్‌ రేస్‌ ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తోంది. హేరాఫెరి 3 - టోట‌ల్ ధ‌మాల్ - డెవిల్స్ డాట‌ర్ - దేశీ మ్యాజిక్ - వ‌న్ డే చిత్రాల్లో ఇషా న‌టిస్తోంది.
   

Tags:    

Similar News