ఫోటో స్టొరీ: ఎర్రగా బుర్రగా ఉన్న ఇషా గుప్తా

Update: 2018-07-30 10:23 GMT
లోకమంతా ఒక తీరు మన బాలీవుడ్ బ్యూటీలు మరో తీరు.. నెపోటిజం అని - క్యాస్టింగ్ కోచ్ అని బయట చాలా హంగామా జరుగుతుంటుంది. కానీ వాటికే మాత్రం సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హీట్ పెంచడమే డ్యూటీగా పెట్టుకుంటారు.  అలాంటి డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తున్న బ్యూటీలలో ఇషా గుప్తా పేరు తప్పనిసరిగా చెప్పుకోవలసిందే.

ఇన్స్టాగ్రామ్ ఫోటోలను శ్రద్ధగా ఫాలో అవుతున్న వారికి, బాలీవుడ్ సినిమాలు చూసేవారికీ ఇష గురించి ఇంట్రడక్షన్ ఇవ్వనవసరం లేదు.  సామి స్క్వేర్ సినిమా టైటిల్ టైప్ లో ఆమె హాటీ స్క్వేర్! కానీ చాలా రోజుల తర్వాత బోల్డు  అవతారంలో కాకుండా ఒక బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ లో అప్సరస అవతారం లో అజా మ్యాగజైన్ కవర్ పేజ్ కి పోజిచ్చింది.  ఎంబ్రాయిడరీ చేసిన బ్లడ్ రెడ్ కలర్ బ్లౌజ్ - మ్యాచింగ్ కలర్ లెహెంగాతో ఇచ్చిన పోజ్ మాత్రం మెస్మరైజింగ్.  ఈ ఫోటో షూట్ కోసం ఆస్తా శర్మ ఇషా కు స్టైలింగ్ చేసింది.   మరో వైపు చూడగానే కళ్ళు తిప్పుకోనేట్టున్న రెడ్ డ్రెస్ అర్పిత మెహత డిజైనట.  వీటికి తోడు థిక్ గా కనిపించే ఐ బ్రోస్ - హెయిర్ ను స్ట్రెయిట్ గా స్టైల్ చేసింది మాత్రం హెయిర్ స్టైలిస్ట్ మెహక్ ఒబెరాయ్.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ భామ నటించే రెండు సినిమాలు 'టోటల్ ధమాల్'.. 'పల్టన్' సెట్స్ మీద ఉన్నాయి.  ఇవి కాకుండా 'హేరా ఫేరీ-3' సినిమాకు కూడా సైన్ చేసిందట. 
Tags:    

Similar News