విడాకుల తర్వాత ఫుల్ హ్యాపీగా ఉందట

Update: 2022-02-20 04:30 GMT
సెలబ్రిటీలు.. సినీ నటుల పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. కొత్త జంటలు పెళ్లి చేసుకుంటుంటే.. మరోవైపు పెళ్లి చేసుకున్న వారు చాలా తక్కువ సమయంలో విడిపోతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. పెళ్లైన ఆరు నెలల వ్యవధిలోనే విడాకుల బాట పట్టింది టాలీవుడ్ నటి ఎస్తర్ నోరోన్హ. కెరీర్ అప్పుడప్పుడే కుదుట పడుతున్న వేళలోనే ఆమె పెళ్లి చేసుకోవటం.. ఆ వెంటనే విడాకులతో ఆమె వార్తల్లో నిలిచారు.

భీమవరం బుల్లోడు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్.. తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా ఆమెకు లభించాల్సినంత గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలోనే లవ్ మ్యారేజ్ చేసుకుంది.తాజాగా ఆమె నటించిన ‘69 సంస్కార్‌ కాలనీ’ మూవీ వచ్చే నెల నాలుగున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ అంశాల్ని వెల్లడించారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పటమే కాదు.. కమిట్ మెంట్ ఇవ్వకుంటే కెరీర్ ఖతమని బెదిరించినట్లుగా ఆమె వెల్లడించారు. ఈ అంశాన్ని ధైర్యంగా చెప్పిన ఆమె.. తన పెళ్లి వివరాల్ని కూడా వెల్లడించారు. నోయల్ తో పెళ్లైన ఆర్నెల్లకే విడాకులు తీసుకోవాల్సి రావటంతో తాను తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు చెప్పారు.

తన కుటుంబ సభ్యులకు విడాకుల గురించి ఎలా చెప్పాలన్న దానిపై తాను చాలా ఒత్తిడికి గురయ్యానని.. ఆ సమయంలో తన కుటుంబం అండగా నిలవటంతో తనలో రెట్టింపు ధైర్యం.. ఎనర్జీ వచ్చిందన్నారు. తమ ఇంట్లో విడాకులు ఇప్పటివరకు లేవని.. ఇంతవరకు అలాంటి వాటి గురించి వినటమే కానీ అనుభం ఎలా ఉంటుందో తెలీదన్నారు.

తనకు అలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదన్నారు. విడాకుల నిర్ణయంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యానని.. ఇప్పుడు మాత్రం తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. కొందరు తప్పు చేశావంటే.. మరికొందరు అండగా నిలుస్తామని చెప్పినట్లు తెలిపారు. విడాకుల అనంతరం తాను రెట్టింపు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. విడాకుల అనంతరం డబుల్ హ్యాపీగా ఉన్నానన్న ఎస్తర్ మాటలు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News