ఫోటో స్టోరీ: ఫ్లాష్ బ్యాక్ కానీ పాప హాట్ షో

Update: 2020-03-24 03:30 GMT
బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ  'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్'..  'నౌటంకీ సాలా'.. 'ఏ జవాని హై దీవాని'.. 'హిందీ మీడియం'.. 'జబ్ హ్యారీ మెట్ సెజల్' లాంటి సినిమాల్లో నటించి చక్కని గుర్తింపే సాధించింది.  ఈ భామ ప్రభాస్ 'సాహో' లో ఒక చిన్న పాత్రలో మెరిసింది. ఈ తరం బ్యూటీల తరహాలోనే ఈ భామ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్.  ఇది లాక్ డౌన్లు.. సెల్ఫ్ ఐసోలేషన్ల కాలం కదా.. అందుకే పాత ఫోటోలు పోస్ట్ చేస్తూ పవర్ ఫుల్ ఫిలాసఫీలు చెప్తూ ఇంట్లోనే కాలం గడుపుతోంది.

తాజాగా ఈ భామ కొన్ని బీచ్ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు రెండు మూడు ఇంట్రెస్టింగ్ క్య్యాప్షన్లు ఇచ్చింది.  "విటమిన్ డీ ని మర్చిపోవద్దు. బీచ్ కు పోలేరు కాబట్టి కిటికీ తెరిచి ఎండలో కూర్చోండి".. "స్వేచ్ఛ లేదని బాధ పడుతున్నారా? లేక ఇంట్లోనే కూర్చుని కరోనా వ్యాపించకుండా సమాజ సేవచేస్తున్నామని సంతోషపడుతున్నారా?".. "నేను అంతర్ముఖురాలిని.  ఏకాంతంగా ఉండడానికి నాకేమీ ఇబ్బంది లేదు కానీ అవుట్ డోర్ ఫన్ మిస్ అవుతున్నా" అంటూ తన మనసులోని భావాలను వ్యక్తీకరించింది.  

ఈ వ్యక్తీకరణ మాత్రమే సరిపోతుందా? విరక్తీకరణ కలగకుండా రక్తీ-కరణ అవసరం లేదా అనుకునేవారికోసం కత్తిలాంటి హాటు ఫోటోలను షేర్ చేసింది. టన్నుల్లో అందాలను వడ్డించింది.  ఈ ఫోటోలకు కామెంట్లు చాలానే వచ్చాయి కానీ కరోనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారేమో కానీ కాస్త బోల్డ్ డైలాగులతో గట్టిగా తగులుకున్నారు.. అవన్నీ రాస్తే సెన్సార్ వారికి కోపం వస్తుందేమో!
Tags:    

Similar News