‘హోలి’ వేడుకల్లో వర్మ చెప్పినట్లే..

Update: 2017-03-14 07:17 GMT
రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ కోసం ట్వీట్లు చేస్తుంటాడని జనాలు విమర్శిస్తుంటారు కానీ.. వర్మ చాలాసార్లు నిజాలే మాట్లాడుతుంటాడన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి. అందరి లాగా మాటలకు ముసుగేయడు వర్మ. మనం బయటికి మాట్లాడని కొన్ని వాస్తవాల్ని ఓపెన్ గా డిస్కస్ చేస్తుంటాడు వర్మ. హోలీ వేడుకలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం శ్రుతి మించినప్పటికీ అందులోనూ కొంత వరకు వాస్తవాలు లేకపోలేదు. హోలీ అంటే అమ్మాయిల్ని తడి అందాల్లో చూసుకోవచ్చని ఆశపడే అబ్బాయిలకు కొదవేమీ లేదు మన దేశంలో. ఐతే యాదృచ్ఛికంగా ఇలా జరగడం ఓకే కానీ.. అబ్బాయిల ఈ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ హోలీ వేడుకల పేరుతో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు దిగజారిపోతుండటం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం.

సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేక.. డబ్బు కోసం ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధపడే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటి వాళ్లను హోలీ వేడుకలకు ఆహ్వానించి.. వాళ్ల తడి అందాల్ని ఎక్స్ పోజ్ చేయిస్తూ.. ఈ వేడుకల వీక్షణకు కూడా డబ్బులు వసూలు చేసే స్థాయికి కొందరు దిగజారిపోయారు. హైదరాబాద్ లో హోలీ వేడుకలు వచ్చినపుడల్లా ఇలాంటి ‘స్పెషల్ ఈవెంట్స్’ కామన్ అయిపోతున్నాయి. 3 వేల రూపాయల నుంచి 10 వేల వరకు ఇలాంటి వేడుకలకు టికెట్లు కూడా పెట్టి అబ్బాయిల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సంస్కృతి ఏటా పెరుగుతూ పోతుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News