ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ పూజా హెగ్డే. స్టార్ హీరోలకు ప్రస్తుతం ఈమె మొదటి ప్రాధాన్యత అయ్యింది. ఇప్పటికే మహేష్ బాబు ఈమెతో సినిమా చేస్తున్నాడు, అల్లు అర్జున్ కు కూడా ఈమె మరోసారి జత కాబోతుంది. ఇంకా పలు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు సినిమాను చేస్తోంది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం కనబర్చని ఈ అమ్మడు గ్లామర్ కు కొత్త అర్థం చెబుతుంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే తాజాగా ఒక సందర్బంలో మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యపర్చుతున్నాయి.
గ్లామర్ హీరోయిన్స్ వేదాంతం మాటలు మాట్లాడితే, వైరాగ్యపు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇప్పుడు పూజా హెగ్డే నోట మాటలు విన్నా కూడా అదే విధంగా అనిపిస్తుంది. తాజాగా పూజా విధి గురించి, అదృష్టం గురించి మాట్లాడుతూ... విధి, అదృష్టం వంటి విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. నాకు దర్శకుడు ఒక సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన సమయంలో దానికి పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఆ పాత్రను నమ్మశక్యంగా తీసుకు వచ్చేందుకు నావంతు కృషి చేస్తాను. నేను ఈ లోకంలోకి రాకముందే నేను చేయాల్సిన పనుల గురించి ముందే నిర్ణయించి ఉంటుంది. వాటినే నేను చేస్తున్నాను తప్ప, ప్రత్యేకంగా నేనంటూ ఏమీ క్రియేట్ చేసి చేయడం లేదు. సినిమా విజయం సాధించినా, ఫ్లాప్ అయినా కూడా నాలో చాలా మార్పును తీసుకు వస్తుంది. ఆ ఫలితంతో చాలా అనుభవాలు దక్కుతాయి. ఆ అనుభవాల నుండి నేర్చుకుని ముందుకు వెళ్తాను. ఇతరులతో పోల్చితే నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను. ఎందుకంటే నా జీవితం చాలా సంతోషమయంగా సాగుతుంది. ఇతరులతో పోల్చితే నేను ఎక్కువగా కష్టాలను అనుభవించడం లేదు అంటూ పూజా వేదాంతపు, వైరాగ్యపు మాటలు మాట్లాడింది.