ఈ మతలబు బాగానే ఉంది! 2020లో థియేటర్ల (ఎగ్జిబిషన్) రంగం పూర్తిగా దెబ్బ తినడంతో ఇప్పుడు 2021లో అయినా కోలుకోవాలని ప్లాన్ గట్టిగానే చేసినట్టున్నారు. కేవలం 50శాతం టిక్కెట్లు 50 శాతం సిట్టింగుతోనే రికవరీ సాధ్యమా? అంటే సాధ్యం కానే కాదు! అని విశ్లేషించిన ఎగ్జిబిటర్లు ఏకంగా టిక్కెట్టు ధరల్ని డబుల్ చేసి అమ్మడం ద్వారా రికవరీ సాధించాలనుకుంటున్నారు.
2021 సంక్రాంతి బరిలో పలు చిత్రాల్ని భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ సిద్ధం చేశారు. రిలీజ్ తేదీల్ని ఇప్పటికే లాక్ చేశారు. సంక్రాంతికి నాలుగు సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీకి దిగుతున్నాయి. వీటిలో రవితేజ క్రాక్ - రామ్ రెడ్- విజయ్ మాస్టర్ వీటితో పాటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ `అల్లుడు అదుర్స్` సంక్రాంతికి విడుదల కానున్నాయి. క్రాక్ జనవరి 9 న విడుదలవుతోంది. తరువాత విజయ్ `మాస్టర్` 13 న విడుదలకు సిద్ధం. రెడ్ 14 న .. అల్లుడు అదుర్స్ 15 న విడుదల కానున్నాయి.
అంతకుముందే హైదరాబాద్ లోని థియేటర్లు సంక్రాంతి విడుదలలకు టికెట్ ధరలను పెంచడం ద్వారా రికవరీ ప్లాన్ చేయడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. నిజానికి కోవిడ్ వల్ల 50శాతం ఆక్యుపెన్సీ నియమం వర్తిస్తోంది. దీంతో కోల్పోయిన వసూళ్లను తిరిగి తేవడమెలా?
అందుకే టిక్కెట్టు రేటును వంద శాతం పెంచారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్లలోని థియేటర్లు ఇప్పటికే ధరల పెరుగుదలను ప్రకటించాయి. మూడు వేర్వేరు తరగతులలో టిక్కెట్ల ధర రూ .150, రూ .100 .. రూ .50. ధరలు మొదటి రెండు వారాల వరకు ఉంటాయి. ఆ తరువాత సాధారణ స్థితికి వస్తాయి. ఇతర ప్రాంతాల్లోని థియేటర్లు కూడా ఇదే విధంగా ఉంటాయి. అయితే ప్రతిసారీ సంక్రాంతి సీజన్ లో పెంచుతున్నా దానికి ఇప్పుడు పూర్తి భిన్నమైన ఆలోచన చేయడమే జనాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి మల్టీప్లెక్సులు టిక్కెట్టు రేటు పెంపుపై ఏ విషయమూ ప్రకటించలేదు.
పరిశ్రమను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే టిక్కెట్టు ధరను పెంచడం ఒక్కటే మార్గమా? అంటే .. ఈ పండుగ సీజన్ వరకూ తప్పదనేది ఎగ్జిబిటర్ల వాదన. 100శాతం ఆక్యుపెన్సీని అనుమతించిన తర్వాత మాత్రమే లాభాలొస్తాయన్న వెర్షన్ వాళ్లకు ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో మార్చికి ముందు అది సాధ్యం కాకపోవచ్చు. ఇకపోతే కొత్తగా స్ట్రెయిన్ వైరస్ రాక నేపథ్యంలో జనం థియేటర్లకు వస్తారా? అన్నది ఇప్పటికి ఇంకా ప్రశ్నార్థకమే. దీనికి తోడు టిక్కెట్టు బాదుడుపై ఆలోచించేవాళ్లు వైరస్ భయాల నడుమ థియేటర్ల గడప తొక్కుతారా? అన్నది సమాధానం లేని చిక్కు ప్రశ్నగానే ఉంది.