థియేటర్లని కాపాడాలని నేషనల్ వైడ్ ట్రెండ్ చేసిన 'ఎగ్జిబిటర్స్'..!

Update: 2020-08-30 18:12 GMT
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మల్టీఫ్లెక్సెస్ మూతబడి ఐదు నెలలు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్-4 మార్గదర్శకాలలో కూడా థియేటర్స్ రీ ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచంలో అత్యధిక కేసులు మనదేశంలో నమోదవడంతో కేంద్రం ఈ రిస్క్ తీసుకోవడానికి ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే థియేటర్స్ తెరవడంపై ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్ ఓనర్స్ ఎక్జిబిటర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే థియేటర్స్ ఓపెన్ చేయకపోవడంతో చాలామంది మేకర్స్ తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాలకు పెట్టిన పెట్టుబడి స్టక్ అయిపోవడంతో ఏం చేయాలో పాలుపోని ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ సినిమాలను ఓటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ లో మాత్రమే పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టగా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా క్రేజీ మూవీ డిజిటల్ రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోలకు నిర్మాతలకు థియేటర్స్ అసోసియేషన్స్ మల్టీప్లెక్సెస్ యూనియన్స్ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పరిస్థితులను బట్టి వారు కూడా ఏమి చేయలేక ఓటీటీల వైపు చూస్తున్నట్లు చెప్తున్నారు. ఇలా అందరూ సినిమాలను డిజిటల్ రిలీజ్ చేస్తే ఫ్యూచర్ లో థియేటర్స్ పరిస్థితి ఏంటని ఎక్జిబిటర్స్ ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ని రక్షించుకోవడానికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా భవిష్యత్ లో సాధారణ పరిస్థితులు వస్తాయని.. అందుకే థియేటర్స్ ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా మద్ధతు కోరుతున్నారు. థియేటర్ సీటింగ్ కెపాసిటీ తగ్గించుకొని.. తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోమని షరతులు విధిస్తూ థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో #SupportMovieTheatres మరియు #SaveCinemas అనే హ్యాష్ ట్యాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఆరు నెలల నుండి ఇన్కమ్ లేదని.. ఎలక్ట్రిసిటీ మినిమమ్ చార్జెస్ లో ప్రాపర్టీ టాక్స్ లో మినహాయింపులేదని.. ఇంకా థియేటర్స్ క్లోజ్ చేసి ఉంచితే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీరంగానికి చెందిన ప్రముఖులు ఈ ట్విట్టర్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసారు. 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ.. 'వకీల్ సాబ్' ప్రొడ్యూసర్ బోనీకపూర్ వంటి వారు కూడా థియేటర్స్ ని కాపాడాలని ట్వీట్స్ చేశారు. మరికొందరు ఎక్జిబిటర్స్ సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో హీరోయిన్స్ సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. మిమ్మల్ని సూపర్ స్టార్స్ ని చేసి ఇంత ఖ్యాతిని తెచ్చిపెట్టిన థియేటర్స్ ని ఇప్పుడు మర్చిపోయారా? కనీసం ఇప్పుడైనా మాకు మీ మద్ధతు తెలుపుతారా? అని ట్వీట్స్ చేస్తున్నారు. మరి వీళ్ళు చేస్తున్న ఆందోళనకు స్టార్స్ సపోర్ట్ చేస్తారా అనేది ప్రశ్న. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News