నచ్చిన హీరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేస్తోందంటే ఫ్యాన్స్ చూపించే అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఆ టైమ్ కి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి నచ్చిన స్టార్ సినిమా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అనుకున్న సమయానికి అప్ డేట్ రాగానే దాన్ని ఓ రేంజ్ లో సోషల్ మీడియా వేదిగా వైరల్ చేసి టాప్ లో ట్రెండ్ అయ్యేలా షేర్ చేస్తుంటారు. మరి అదే స్టార్ హీరో అప్ డేట్ అనుకున్న సమయానికి రాకపోతే.. డేట్, టైమ్ ప్రకటించినా రోజులు తరబడి దాని గురించి ఎదురుచూడాల్సి వస్తే అభిమానుల్లో ఫ్రష్ట్రేషన్ పీక్స్ కి చేరుకుంటుంది.
ఇప్పుడు ఇదే ఫ్రస్ట్రేషన్ ని మెగా అభిమానులు గత కొన్ని రోజులుగా ఫీలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తరువాత 'గాడ్ ఫాదర్'మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన్ రాజా రూపొందిస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా రూపొందిన ఈ మూవీలో ఫస్ట్ టైమ్ చిరు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నారు.
అంతే కాకుండా ఈ సినిమాలో చిరుకు ప్రత్యేకించి హీరోయిన్ లేదు. స్పెషల్ సాంగ్స్ కూడా లేవు. దీంతో మెగాస్టార్, సల్మాన్ ఖాన్ లపై ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించగా 'థార్ మార్ తక్కర్ మార్..' అంటూ భారీ స్థాయిలో ఓ పార్టీ సాంగ్ ని షూట్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోని సెప్టెంబర్ 13న సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సాయంత్రం 5.05 గంటలకు రెడీగా వుండండి అంటూ ఫ్యాన్స్ ని అలర్ట్ చేశారు.
అయితే ఆ రోజు సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ కాలేదు. కేవలం ఆడియో సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. మేకర్స్ ని ట్రోల్ చేశారు. ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి రోజులు గడుస్తున్నా రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ చాలా వరకు డిజప్పాయింట్ అయ్యారు. మిమ్మల్ని నమ్మలేం అంటూ మేకర్స్ పై విరుచుకుపడ్డారు. రెడీగా లేనప్పుడు డేట్ ప్రకటించడం ఎందుకో అంటూ సెటైర్లు వేశారు.
అయితే మొత్తానికి ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడబోతోంది. గత కొన్ని రోజులుగా అప్పుడు.. ఇప్పుడు అంటూ ఊరించుకుంటూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ 'థార్ మార్ తక్కర్ మార్ ' ని బుధవారం సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సారైనా కరెక్ట్ గా రిలీజ్ చేస్తారా? అంటూ ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే 'గాడ్ ఫాదర్' కోసం రెండు భారీ ఈవెంట్ లని అనంతపూర్, ముంబైలలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.