ఆటగాడిగా రాణించి ఆ తరువాత కోచ్ గా బాధ్యతలు చేపట్టి భారతదేశానికి తురుపుముక్కల్లాంటి క్రీడాకారులను అందించడమే ధ్యేయంగా పెట్టుకుని రేయింబవళ్లు కష్టపడుతున్న వ్యక్తి పుల్లెల గోపీచంద్. ఆటగాడిగా తన కెరీర్ ముగిశాక కోచ్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సైనా నెహ్వాల్ - కాదాంబి శ్రీకాంత్ ఇప్పుడు పూసర్ల వెంకట సింధు లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్ళని అందించాడు.
ఈ నేపథ్యంలో తెలుగులో గోపీచంద్ జీవితకథను వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నాలు మొదలైన సంగతి తెలిసినదే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు ఈ లీడ్ రోల్ ని ప్లే చేయనున్నాడు.
అయితే రియో ఒలింపిక్స్ లో గోపీ శిష్యుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి కారణంగా గోపీ ఖ్యాతి మరిన్ని రేట్లు పెరిగింది. కాబట్టి ఈ బయో పిక్ పై ఇప్పుడు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో స్క్రిప్ట్ విషయాలలో సైతం మార్పులు జరిగే అవకాశం వుంది.