శర్వానంద్ మరో శ్రీమంతుడా?

Update: 2017-05-12 07:27 GMT
రాధ మూవీతో యంగ్ హీరో శర్వానంద్ థియేటర్లలోకి వచ్చేశాడు. ఉగాది సందర్భంగా మార్చ్ లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడీ సినిమాకి మహేష్ బాబు శ్రీమంతుడుతో ఓ పోలిక పెడుతున్నారు సినీ జనాలు.

రెండేళ్ల క్రితం బాహుబలి ది బిగినింగ్ తర్వాత శ్రీమంతుడును షెడ్యూల్ చేశారు. మొదట ఒక వారం తేడాలోనే షెడ్యూల్ చేసినా ఆ తర్వాత నెల రోజుల వ్యవధి ఇచ్చారు. దశాబ్దాల తరబడి థియేటర్లకు రావడం మానేసిన ఎంతో మంది ప్రేక్షకులను బాహుబలి మొదటి భాగం రప్పించడంతో.. కలెక్షన్స్ వరద పారింది. ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడుకి ఇది అడ్వాంటేజ్ అయింది. అఫ్పటివరకూ 60 కోట్ల రేంజ్ లో ఉన్న కలెక్షన్స్.. శ్రీమంతుడికి 85.2 కోట్లకు చేరాయి. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ హవా కాసింత నెమ్మదిస్తోంది. ఈ సమయంలో వస్తున్న మూవీ శర్వానంద్ నటించిన రాధ.

గత కొన్నేళ్లుగా ఫ్లాప్ అనేది లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు శర్వానంద్. ఇప్పుడు రాధ చిత్రం కూడా జనాలను మెప్పించేట్లుగానే కనిపిస్తోంది. కంటెంట్ లో కాసింత దమ్ము ఉన్నా.. శ్రీమంతుడు టైపు బాహుబలి2 అడ్వాంటేజ్ ను ఫుల్లుగా క్యాష్ చేసుకుని.. భారీ వసూళ్లను రాబట్టుకునే అవకాశం రాధకు ఉంటుంది. ఈ రాధ మరో శ్రీమంతుడు అవుతాడో లేదో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News