షాక్ : ఎఫ్2 అప్పుడే వచ్చేస్తోందా?

Update: 2019-02-06 08:15 GMT
ఇప్పటిదాకా కేవలం ఆడియో వీడియో శాటిలైట్ హక్కుల రూపంలో మాత్రమే సినిమాకు ఆదాయం తెచ్చుకుంటున్న నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ బంగారు బాతులా మారిపోయింది. విడుదలకు ముందే క్రేజీ ఆఫర్ తో ఆ సంస్థ గేలం వేస్తుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దానికి సై అంటున్నారు. కాని చాప కింద నీరులా దీని ప్రభావం ముందు ముందు థియేట్రికల్ రన్ మీద ఎంత తీవ్రంగా పడబోతోందో కళ్ళ ముందు కనిపిస్తోంది.

నిన్న కెజిఎఫ్ అమెజాన్ ప్రైమ్ లోకి రాగానే ఇంకా సక్సెస్ ఫుల్ గా ఆ సినిమా నడుపుతున్న సినిమా హాళ్ళ కలెక్షన్స్ డౌన్ అయ్యాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమెజాన్ లో ఎకౌంటు ఉన్నా లేకపోయినా దాని తాలుకు వెర్షన్ రకరకాల రూపాల్లో బయటికి వస్తోంది. సో ఇంత క్లారిటీతో సినిమా చూసే అవకాశం దక్కినప్పుడు హాల్ దాకా ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

తాజాగా అందిన మరో షాక్ ఏంటంటే సంక్రాంతి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్2 ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోందని. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ విడుదలకు ముందే దిల్ రాజు కేవలం 30 రోజుల తర్వాత ఎప్పుడైనా అనే నిబంధన మీద ఒప్పందం జరిగిందట. సో 10తో నెల రోజులు పూర్తవుతాయి కాబట్టి అదే రోజు అర్ధరాత్రి వచ్చేస్తుందన్న మాట. అయితే ఎఫ్2 ఇంకా చాలా సెంటర్స్ లో స్ట్రాంగ్ గా ఉంది. 50 రోజుల దాకా ఎలాంటి ఇబ్బంది లేదని ట్రేడ్ బల్లగుద్ది చెబుతోంది.

ఈ నేపధ్యంలో ఎఫ్2 ఇలా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేస్తే వచ్చే బాలన్స్ కలెక్షన్స్ లో ఖచ్చితంగా కోత పడుతుంది. రిపీట్ ఆడియన్స్ డ్రాప్ అవుతారు. గతంలో నాని ఎంసిఎ టైంలో ఇలాగే జరిగింది. అయితే టెక్నాలజి వాడకం ఇంతగా లేదు. ఇప్పుడు భీభత్సమైన మార్పులు వచ్చేసాయి. ఈ నేపధ్యంలో ఇకనైనా నిర్మాతలు ఇలా అధిక మొత్తానికి ఆశపడి 30 రోజుల గడువుకే సినిమాలు ఇచ్చేస్తే అవతల కోట్లు పోసి థియేటర్ హక్కులు కొన్న బయ్యర్లకు ఇది శరాఘాతంగా మారుతోంది. ఈ దిశగా ఇప్పటికైనా ఆలోచిస్తే బెటర్
Tags:    

Similar News