#F3 మ‌హేష్ నిజంగా ఒప్పుకున్నాడా!

Update: 2020-02-20 08:45 GMT
# F3 .. అనీల్ రావిపూడి క్రేజీగా ప్రిప‌రేష‌న్స్ సాగిస్తున్న‌ ప్రాజెక్ట్ ఇది. 2018 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాక ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామ‌ని అనీల్ రావిపూడి- దిల్ రాజు అప్ప‌ట్లోనే క‌న్ఫామ్ చేసారు. ఆ క్ర‌మంలోనే సీక్వెల్ స్క్రిప్టును ప్రిపేర్ చేయ‌డంలో అనీల్ రావిపూడి ర‌చ‌యిత‌ల బృందం త‌ల‌మున‌క‌లు అయ్యారు. అటుపై రావిపూడి స‌రిలేరు చిత్రంతో బిజీ అయ్యారు. అయితే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో వెంకీ- వ‌రుణ్ ల‌తో పాటుగా మూడో హీరో ఉంటారు అన్న ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చాక ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులే బ‌య‌ట‌ ప‌డ్డాయి.

తొలుత ఆ మూడో పాత్ర‌కు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను కన్ఫామ్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. కొద్దిరోజుల్లోనే మ‌హేష్ ని ఒప్పించార‌నే సంగ‌తి వైర‌ల్ అయ్యింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం చేసే స‌మ‌యంలోనే అనీల్ రావిపూడికి మ‌హేష్ మ‌రో సినిమాని ఆఫ‌ర్ చేశారు. అయితే అది స‌రిలేరు సీక్వెల్ అన్న ప్ర‌చారం సాగుతుండ‌గానే.. అంత‌కుముందే ఎఫ్2 సీక్వెల్ లో మ‌హేష్ న‌టిస్తారు అన్న ప్ర‌చారం వేడెక్కించేశారు. సూప‌ర్ స్టార్ ఈ చిత్రానికి 30 రోజుల కాల్షీట్లు ఇచ్చేశారు.. సెకండాఫ్ లో మాత్ర‌మే ఆయ‌న క‌నిపిస్తారు! అంటూ ర‌క‌ర‌కాలుగా ప్రచార‌మ‌వుతోంది. మే 2020 నుంచి ఎఫ్ 3 చిత్రీక‌ర‌ణ సాగుతుంది. మ‌హేష్ స‌ర‌స‌న‌ ర‌ష్మిక న‌టించే వీలుంద‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది.

అయితే ఇది నిజ‌మా? త‌న ద‌ర్శ‌కుల విష‌యంలో ఎంతో క‌మిటెడ్ గా ఉండే మ‌హేష్ తాను ప్ర‌క‌టించిన‌ట్టే రావిపూడితో మ‌రో సినిమా చేస్తున్నాడా? ఎఫ్ 3 కి అత‌డు అంగీక‌రించాడా? లేదూ అవ‌న్నీ గాలి వార్త‌లేనా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎఫ్ 2 సీక్వెల్ కి మ‌హేష్ ఓకే చెప్పార‌ని న‌మ్ర‌త కానీ ఆయ‌న త‌రపు ప్ర‌చార‌క‌ర్త‌లు కానీ రివీల్ చేయ‌నేలేదు. ఓవైపు మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్ 28 స‌న్నాహకాలు సాగుతుండ‌గా ఎఫ్ 3 లో మ‌హేష్ న‌టిస్తారు అన్న‌ది మాత్రం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజం ఎంత‌? అన్న‌దే తేల‌డం లేదు.
Tags:    

Similar News