ఇటు వెంకటేశ్ అభిమానులు .. అటు మెగా అభిమానులు 'ఎఫ్ 3' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ - శిల్పకళావేదికలో నిర్వహించారు. 'ఫన్'టాస్టిక్ ఈవెంట్ అనే పేరు పెట్టినట్టుగానే, ఈ షోను డిజైన్ చేసిన తీరు సరదాగా .. సందడిగా సాగుతూ హాయిగా నవ్వించింది. వెంకటేశ్ తన స్టార్ డమ్ పక్కన పెట్టేసి చేసిన అల్లరి ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో తన పాత్రకి తగినట్టుగా రేచీకటితో ఇబ్బందిపడుతున్నవాడిగా ఎంట్రీ ఇస్తూనే వెంకటేశ్ తన అల్లరి స్టార్ట్ చేశారు. ఇక 'ఎఫ్ 2' వర్సెస్ 'ఎఫ్ 3' మధ్య చిన్న పోటీ ఒకటి స్టేజ్ పై సెట్ చేశారు. 'ఎఫ్ 2' టీమ్ కి దిల్ రాజు - శిరీష్ నేతృత్వం వహిస్తే, 'ఎఫ్ 3' టీమ్ తరఫున అనిల్ రావిపూడి నిలబడ్డాడు. బిగ్ స్క్రీన్ పై వీడియో ప్లే చేసి .. రెండు టీమ్ ల తోను 'రీల్స్' చేయించారు. 'ఆటకావాలా పాట కావాలా' రీల్ కి అలీ .. మెహ్రీన్ చేసిన డాన్స్ ఆకట్టుకుంది. 'ఇంద్ర'లో మొక్కేకదా అని పీకేస్తే అనే చిరంజీవి రీల్ ను వెంకటేశ్ అదరగొట్టేశారు.
అలాగే బాలకృష్ణ 'లక్ష్మీ నరసింహా' సినిమాలోని డైలాగ్ కి సంబంధించిన రీల్ లో వరుణ్ తేజ్ ఇరగదీశాడు. ఇక 'గణేశ్' సినిమాలోని వెంకీ డైలాగ్ రీల్ తో అనిల్ రావిపూడి శభాష్ అనిపించుకున్నాడు. 'శివమణి' సినిమాలోని నాగ్ డైలాగ్ రీల్ ను దిల్ రాజు ట్రై చేశారు. ఆ తరువాత 'బొబ్బిలిరాజా' సినిమాలోని 'బలపం పట్టి' .. పాటకి స్టేజ్ పై వెంకటేశ్ స్టెప్పులు వేసి మరింత సందడి చేశారు. ఇప్పటికీ ఆయన అదే ఈజ్ తో స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. ఇక సునీల్ చేసిన 'మూకాభినయం' కూడా అందరినీ నవ్వించింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమన్నా రాలేకపోయింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ వాటా .. కోటానే ఎక్కువ. ఆమె వస్తే ఇంకాస్త బాగుండేది. మెహ్రీన్ .. సోనాల్ స్టేజ్ పై అందంగా మెరిశారు. ఒకరికంటే ఒకరం గ్లామరస్ గా వచ్చామా లేదా?అనే ఒక ప్రశ్నతో కూడిన లుక్స్ తో అక్కడక్కడా వాళ్లు దొరికిపోయారు. మొత్తం మీద సినిమాలో ఎంత ఫన్ ఉంటుందనేది స్టేజ్ పైనే చూపించేశారు. ఈవెంట్ లో పాడిన పాటలనే పాడించి .. చేసిన డాన్సులనే చేయించి బోర్ కొట్టించకుండా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా కొత్తగా జరిగింది. ఇక పై జరగనున్న ఈవెంట్స్ కి ఒక కొత్త రూట్ చూపించిందనే చెప్పాలి.