ఎఫ్‌ 3 ట్రైలర్ అప్డేట్‌ వచ్చిందోచ్‌..!

Update: 2022-05-02 05:35 GMT
సూపర్‌ హిట్‌ మూవీ ఎఫ్ 2కు సీక్వెల్‌ గా రూపొందిన ఎఫ్ 3 సినిమా ను మే 27న విడుదల చేసేందుకు సర్వం సిద్దం అయ్యింది. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్స్ గా తమన్నా మరియు మెహ్రీన్ లు నటించారు. ఎఫ్‌ 2 లో మాదిరిగానే ఎఫ్ 3 లో అవే పాత్రలను కంటిన్యూ చేస్తున్నారు. కథ విషయంలో మాత్రం ఎఫ్ 2 కు మరియు ఎఫ్ 3 కి సంబంధం ఉండదు అంటూ మొదటి నుండే యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

గత ఏడాదిలోనే ఈ సినిమాను అనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో సగటు తెలుగు సినీ ప్రేమికులు ప్రేక్షకులు ఎఫ్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఈ సమయంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

సినిమా ట్రైలర్ ను ఈనెల 9న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్‌ దాదాపుగా మూడు వారాల ముందుగానే విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఓ రేంజ్ లో ఎఫ్‌ 3 కి ప్రమోషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది.

అనీల్‌ రావిపూడి ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగలేదు. అందుకే ఆయన ఎఫ్ 3 తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్ లు తమ కామెడీ యాంగిల్‌ ను ఫుల్‌ గా చూపించారు. ఎఫ్‌ 3 లో అంతకు మించి అన్నట్లుగా కామెడీ ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అదనంగా సునీల్‌ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనది దాదాపుగా హీరో రోల్‌ అనే వార్తలు కూడా వస్తున్నాయి.

వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌ సినిమా తప్పకుండా మరో విజయాన్ని సొంతం చేసుకుని మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలకు ఆజ్యం పోస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తుంది. హీరోలుగా ఇమేజ్‌ లను పక్కకు పెట్టి మంచి ఎంటర్‌ టైన్మెంట్‌ ను ఎఫ్‌ 2 సినిమాలో ఇచ్చిన వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు ఎఫ్ 3 లో అంతకు మించి ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందిస్తారనే ఆశిద్దాం. ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతాయేమో చూడాలి.
Tags:    

Similar News