జ‌యంతి బ‌తికే ఉంది... రూమ‌ర్లు న‌మ్మద్దు

Update: 2018-03-28 06:04 GMT
సీనియ‌ర్ న‌టి జ‌యంతి, అనారోగ్యానికి గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.అయితే ఆమె అనారోగ్యం గురించి వార్త రాగానే - కొంద‌రు నెటిజ‌న్లు మ‌రో సినియ‌ర్ న‌టి మృతి అంటూ వార్త‌ల‌ను పోస్టు చేశారు. దీంతో ఆమె మ‌ర‌ణించిందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. దాంతో వాటిని ఖండిస్తూ జ‌యంతి బ‌తికే ఉంద‌ని, అనారోగ్యం నుంచి కోలుకుంటోందని ఆయ‌న కుమారుడు స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఈ నెల 25న‌ శ్వాస కోశ‌లో ఇబ్బందుల‌తో సీనియ‌ర్ న‌టి జ‌యంతి ఆసుపత్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటోంది. ఆమె కుమారుడు మీడియాతో మాట్లాడుతూ...‘సోష‌ల్ మీడియాలో అమ్మ చ‌నిపోయారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని టీవీ ఛానళ్లు కూడా జ‌యంతి చ‌నిపోయారంటూ క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నారు. దయ‌చేసి వాటిని న‌మ్మ‌కండి. జ‌యంతి బ‌తికే ఉన్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా తెలియ‌ని కార‌ణంగానే ఇలాంటి రుమార్లు వ‌స్తున్నాయి. ఆమె వైద్యుల చికిత్స‌కు స్పందిస్తున్నారు. మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు..’ అంటూ చెప్పాడు. 1960 ద‌శకంలో సినిమాల్లోకి వ‌చ్చిన జ‌యంతి... తెలుగు - త‌మిళ‌ - క‌న్న‌డ‌ - మ‌ల‌యాళం - హిందీ - మ‌రాఠీ చిత్రాల‌లో న‌టించారు.

తెలుగులో మోహ‌న్‌ బాబు ఆల్ టైం బ్లాక్‌ బ‌స్ట‌ర్ చిత్రం ‘పెద‌రాయుడు’లో ఆయ‌న‌కు అత్త‌గా న‌టించింది జ‌యంతి. అలాగే జ‌స్టిస్ చౌద‌రి - స్వాతికిర‌ణం - వంశానికొక్క‌డు వంటి చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించింది. ఆమె త్వ‌రగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో డిశార్జి కావాలని అంద‌రూ కోరుకుంటున్నారు.


Tags:    

Similar News