అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం సౌత్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కు సంబంధించిన తమిళ మరియు తెలుగు ఆడియో కోసం ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. సమంత నటించడంతో పాటు ఈ వెబ్ సిరీస్ సౌత్ ఇండియన్ కు సంబంధించింది కనుక హిందీతో పాటు తెలుగు మరియు తమిళంలో కూడా ఒకే సారి స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. తమిళం మరియు తెలుగు ఆడియోలను అప్పుడే అందుబాటులో ఉంచాలనుకున్నా కూడా తమిళనాట వివాదం కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. వెబ్ సిరీస్ తమిళులకు వ్యతిరేకంగా ఉందంటూ చాలా వివాదాలు నడిచాయి.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పై వచ్చిన విమర్శలు.. వివాదాల నేపథ్యంలో సౌత్ లో తెలుగు మరియు తమిళ ఆడియోలతో చూడాలనే ఆసక్తి చాలా మంది వ్యక్తం చేశారు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. అందుకే ఆమెకు ఉత్తరాదిన మంచి గుర్తింపు వచ్చింది. కనుక సౌత్ ఆడియన్స్ చూడాలని ఆసక్తి చూపించారు. చాలా మంది హిందీ ఆడియోతోనే సబ్ టైటిల్స్ ను ఉపయోగించి ఏదో విధంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ చూశారు. కాని కొందరు మాత్రం నెలల తరబడిగా సౌత్ భాషల ఆడియో కోసం వెయిట్ చేశారు.
నెలలు గడుస్తున్న ఈ సమయంలో ఇక సౌత్ లో ది ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్ ఉండక పోవచ్చు అంటూ అంతా భావించారు. ఆ సమయంలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కు సంబంధించిన తెలుగు మరియు తమిళ భాషల్లో ఆడియోలు అందుబాటులోకి వచ్చాయి. గత కొన్ని నెలలుగా అమెజాన్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తూ కొన్ని వేల మంది ఎప్పుడు తెలుగు మరియు తమిళం భాషల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఉంటుంది అంటూ ప్రశ్నించారు. ఎట్టకేలకు వారు తెలుగు మరియు తమిళ భాషల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ను తీసుకు వచ్చి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభం అయిన వెంటనే కొన్ని లక్షల వ్యూస్ ది ఫ్యామిలీ మాన్ కు వచ్చినట్లుగా నిపుణులు చెబుతున్నారు.