యూనివర్సల్ హీరో కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో 'భారతీయుడు 2' ఇటీవల ట్రెండీ టాపిక్. శంకర్ ఈ చిత్రం కోసం అసాధారణ బడ్జెట్ తో భారీ ప్రయోగం చేస్తున్నాడన్న టాక్ ఉంది. అయితే రకరకాల కారణాలతో ఈ సినిమా షూటింగ్ కి ఆటంకాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.
మహమ్మారికి ముందు దురదృష్టకర క్రేన్ ప్రమాదం జరిగింది. సెట్ అసిస్టెంట్ల మరణంతో షూటింగ్ నిలిచిపోయింది. కమల్ హాసన్ కి ఇతర నటీమణులకు మేకప్ పరమైన సమస్యలు వచ్చాయని కూడా గుసగుసలు వినిపించాయి. నిర్మాతలతో దర్శకుడి గొడవలు అభిప్రాయ విభేధాలతో చాలా మంది సినిమా పూర్తిగా ఆగిపోయిందని అనుకున్నారు. అయితే అన్ని పుకార్లకు స్వస్తి పలికి రీసెంట్ గా షూట్ స్టార్ట్ చేసారు. కోర్టుల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. కమల్ హాసన్ చొరవతో లైకా సంస్థ- శంకర్ మధ్య తిరిగి సఖ్యత కుదిరింది.
దీంతో ఆర్.సి 15 చిత్రానికి బ్రేక్ ఇచ్చి శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తెరపైకి వచ్చినట్లు సమాచారం. యోగరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో అదే విషయాన్ని ధృవీకరించారు. తన మేకప్ మ్యాన్ తో కలిసి అతడు ఫోటో దిగాడు. నిజానికి యోగరాజ్ స్వతహాగానే నటుడు. గతంలో బాలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటించారు.
భారతీయుడు 2 సెట్స్ లోకి జాయిన్ అవుతున్నానని చందమామ కాజల్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్- సిద్దార్థ్- సముద్రఖని- బాబీ సింహా- వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
చరణ్ తో RC15 ఇదీ సంగతి ఇప్పటివరకు ఆర్.సి 15 చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. శంకర్ ఇటీవల తిరుపతిలో భారతీయుడు 2 షెడ్యూల్ ను ముగించిన అనంతరం షార్ట్ గ్యాప్ లో #RC15 10 రోజుల షెడ్యూల్ ను వేగంగా పూర్తి చేయడానికి రాజమండ్రిలో ప్లాన్ చేసారు.
ఇక ఇప్పటివరకూ చిత్రీకరించిన ఔట్ పుట్ పై దిల్ రాజు సంతృప్తిగానే ఉన్నారనేది మరో టాక్. చరణ్ ఈ ప్రాజెక్టులో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దిల్ రాజుతో కలిసి పనులు చకచకా పూర్తయ్యేందుకు సహకరిస్తున్నారు. ఇప్పటికే సంగీతం కోసం థమన్ చాలా హార్డ్ వర్క్ చేస్తుండడంతో#RC15 పై భరోసా పెరుగుతోందని సమాచారం. కొన్ని పరాజయాల తర్వాత శంకర్ కి ఈ మూవీ గ్రేట్ కంబ్యాక్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.