ఆదిపురుష్‌.. ఇంకా ఎన్నాళ్లు ఈ ఫ్యాన్‌ మేడ్‌ చూడాలి గురూ!

Update: 2022-08-29 07:18 GMT
ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓమ్ రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమా కోసం అభిమానులు దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం సమయంలో ఈ ఆగస్టు కు విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. అంటే మొన్న వారం ఆదిపురుష్‌ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా ఇతర కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యం అయ్యింది.

భారీ సినిమా కనుక ఆలస్యం అవుతుందని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా వస్తుందంటే మళ్లీ ఆ డేట్ కోసం వెయిటింగ్ మొదలు పెట్టారు. సినిమా ఎప్పుడైనా సరే రానివ్వండి కనీసం సినిమాకు సంబంధించిన పోస్టర్స్ లేదా వీడియోలు ఏదో ఒకటి విడుదల చేస్తే సినిమా గురించి మాట్లాడుకుంటూ వెయిట్‌ చేస్తాం కదా అంటూ ప్రభాస్ అభిమానులు అంటున్నారు.

సినిమా ను ప్రకటించినప్పటి నుండి సోషల్‌ మీడియా లో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ లు కొన్ని వందలు వచ్చాయి. అందులో కొన్ని వావ్‌ అనిపించేలా ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని దర్శకుడు ఓమ్‌ రౌత్‌ కూడా షేర్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఓమ్‌ రౌత్ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉన్న మరో ఫ్యాన్‌ మేడ్ పోస్టర్ వచ్చింది.

రాముడి పాత్రలో ప్రభాస్ ను చూపిస్తూ చాలా విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌ తో ప్రభాస్ లుక్ ను డిజిటల్ పెయింటింగ్ తో ఆదిపురుష్‌ పోస్టర్ ను ఒక అభిమాని రెడీ చేశాడు. ఆ పోస్టర్ కాస్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

సినిమా నుండి అధికారికంగా ఎలాగూ పోస్టర్స్ రావడం లేదు.. కనీసం ఇలా ఫ్యాన్‌ మేడ్ పోస్టర్స్ తో అయినా సరి పెట్టుకుందాం అంటూ కొందరు అభిమానులు నిట్టూర్చుతూ ఉంటే మరి కొందరు అభిమానులు మాత్రం దర్శకుడు ఓమ్‌ రౌత్ పై ఇంకా ఎన్నాళ్లు ఇలా ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్స్ ను చూడాలి అంటూ విమర్శలు చేస్తున్నారు.

షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయినా కూడా ఇంకా గ్రాఫిక్స్ వర్క్‌ పూర్తి అవ్వని కారణంగా సినిమా పోస్టర్ లేదా టీజర్‌ ను విడుదల చేయడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించగా విలన్ గా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ నటించిన విషయం తెల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News