తమ అభిమాన హీరో రూపాన్ని తలుచుకోవడమే కాదు.. ఆ రూపాన్ని కళారూపకంగా మార్చేస్తూ కొందరు నేచురల్ ఆర్టిస్టులు చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అతడు ఎవరో కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఒక ఆకు (తమలపాకు)పై డ్రాగ్(#లీఫ్ ఆర్ట్) చేసిన తీరు వ్వావ్ అనిపిస్తోంది. అద్భుతమైన చిత్రలేఖనం లేదా స్కల్ప్చర్ విద్య ఇదని ప్రశంసించాల్సిందే.
పట్టుకుంటే చినిగిపోయే ఆకుపై అంత పర్ఫెక్ట్ గా ఆర్ట్ ని డిజైన్ చేయాలంటే కచ్ఛితంగా అతడు చేయి తిరిగిన ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ అయ్యి ఉండాలి. డ్రాయింగ్ స్కల్పర్ వంటి విద్యల్లో గొప్ప నిష్ణాతుడు అయినా అయ్యుండాలి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ తరహా ప్రతిభకు నేటి సమాజంలో కొదవేమీ లేదు. వెలికి తీస్తే ఆణిముత్యాలున్నారు.
ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు తెచ్చేవిధంగా ఈ ఫోటోని తీర్చిదిద్దారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో నుంచి ఫోటో ఇది.ఈ వీడియోలో వైష్ణస్ ఆర్ట్ అనే వాటర్ మార్క్ ఉంది. ఆర్టిస్టు ఎవరు? అన్నది మాత్రం తెలీదు. ఇక ఆర్.ఆర్.ఆర్- ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం చరణ్ ఆత్రంగా ఉన్నారు. సెకండ్ వేవ్ చిక్కుల నుంచి బయటపడి పెండింగ్ చిత్రీకరణల్ని ముగించి తదుపరి శంకర్ తో సెట్స్ కెళ్లేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. వివాదాలు చట్టపరమైన సమస్యలతో శంకర్ సినిమా ఆలస్యమైతే అతడు వేరొక సినిమా చేసే వీలుంది.