కమల్ హాసన్- శంకర్ క్రేజీ కలయికలో వచ్చిన సంచలన చిత్రం `భారతీయుడు`. 23 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి నేటి సమకాలీన పరిస్థితుల్ని ఆడాప్ట్ చేస్తూ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న భారతీయుడు 2 చిత్రీకరణకు ఆరంభం పలు అడ్డంకులు ఎదురయ్యాయి. అన్నిటినీ అధిగమించి ఇప్పటికే చెన్నయ్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో తదుపరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించారు.
మంగళవారం రాత్రి కమల్ రాజమండ్రికి చేరుకోగా అక్కడ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరో 20 రోజుల పాటు కమల్ ఇక్కడే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆయన సెంట్రల్ జైల్లోకి వెళ్లగానే అక్కడా స్వాగతం ఓ రేంజులో ఉంది. జైలర్లు అంతా కమల్ హాసన్ తో ఎంతో ఆప్యాయంగా కలిసిపోయి కరచాలనం చేశారు. ఒక రకంగా సెంట్రల్ జైల్లో కమల్ ఫ్యానిజం కనిపిస్తోంది. ఆ మేరకు వీడియోలు- ఫోటోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాజల్- రకుల్ ప్రీత్ సింగ్- సిద్ధార్థ్- ప్రియా భవానీ శంకర్ - విద్యుత్ జమ్వాల్-దిల్లీ గణేష్-నెడుముడి వేణు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి షెడ్యూల్ లో కమల్ హాసన్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి పీటర్ హెయిన్స్ సారథ్యంలో యాక్షన్ దృశ్యాల్ని ప్లాన్ చేశారని వార్తలొచ్చాయి. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అత్యంత కీలకమైన ఇంటర్వెల్ సీన్స్ ని తీస్తున్నారట. ముఖ్యంగా సేనాపతి గెటప్ తో ఉన్న కమల్ పై కీసీన్స్ ని ఇక్కడ తీయబోతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ - ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. సినిమాను 2020లో విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ సినిమా మొత్తం అవినీతి నేపథ్యంలో తెరకెక్కబోతోంది కాబట్టి 2021లో తమిళనాడులో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని శంకర్ భావిస్తున్నారట. కమల్ హాసన్ మక్కన్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు కాబట్టి ఇదే కరెక్ట్ నిర్ణయమని భావిస్తున్నారట. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను భారీ బడ్జెట్‌పై నిర్మిస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి