ఫోటో స్టొరీ: బ్యూటీపై అభిమానంతో గ్రాఫిటీ

Update: 2018-11-04 04:44 GMT
గ్రాఫిటీ.  ఈ పదం వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమా.  మెగా ఫ్యాన్స్ కు 'ఆరెంజ్' చేదు జ్ఞాపకమేగానీ అందులోని పాటలు ఇప్పటికీ వింటుంటారు. ఇక అందులో చరణ్ ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద గోడల మీద గ్రాఫిటీ వేస్తూ కనిపిస్తాడు.  ఆదివారం పొద్దున్నే చరణ్ గ్రాఫిటీ సంగతెందుకు గుర్తొచ్చిందంటే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వల్ల.

ఇతర బాలీవుడ్ హాటీలకు ఉన్నట్టే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఫాలోయింగ్ భారీగానే ఉంది. అయితే అలాంటి అభిమానులలో గ్రాఫిటీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళేం చేశారంటే జాక్వెలిన్ నివసిస్తున్న బాంద్రా ఏరియాలోని ఇంటి కాంపౌండ్ వాల్ పైన గ్రాఫిటీ వేశారు.  జాకీ పేక ముక్క బొమ్మ వేసి అందులో జాక్వెలిన్ ఫేస్ పెయింట్ చేశారు. ఇక ఈ గ్రాఫిటీకి 'జాక్ అఫ్ హార్ట్స్' అని క్యాప్షన్ ఇచ్చారు. చూడగానే ఆకట్టుకునేలా ఉంది ఆ గ్రాఫిటీ.  ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటినుండి జాక్వెలిన్ అభిమానులు అక్కడికెళ్ళి జాక్వెలిన్ గ్రాఫిటీ తో సెల్ఫీ తీసుకుంటున్నారట.  అంతే కాదు జాక్వెలిన్ ఇంటిని గుర్తుపట్టడం అందరికీ చాలా సులువైపోయిందట!

అంతా బాగానే ఉంది గానీ ఈ జాక్ ఆఫ్ హార్ట్స్ అనే పేరు జాక్వెలిన్ కు ఎందుకు వచ్చిందనే అనుమానం మీకు రాలేదా?  దానికో కారణం ఉంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కొద్ది రోజుల క్రితం జాక్వెలిన్ ను జాక్ ఆఫ్ హార్ట్స్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ కాంప్లిమెంట్ జాక్వెలిన్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చడంతో ఆమెను జాక్ ఆఫ్ హార్ట్స్ అని పిలవడం మొదలుపెట్టారు.  ఈ గ్రాఫిటీ కూడా అదే కాన్సెప్ట్ తో వేసిందే!


Tags:    

Similar News