తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `వారీసు`. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈమూవీని తెలుగులో `వారసుడు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో తమిళ, తెలుగు భాషల్లో జనవరి 12న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ కోసం దిల్ రాజు భారీ స్థాయిలో థియేటర్లని రెడీ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `వీర సింహారెడ్డి`, చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య` సినిమాలు ఈ సంక్రాంతికే రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమాలకు మించి భారీ స్థాయిలో `వారసుడు` కోసం థియేటర్లని దిల్ రాజు బ్లాక్ చేశాడట. ఇదే ఇప్పడు వివాదంగా మారింది. ఈ వివాదం వల్ల `వారసుడు` టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తమిళ నాడులోనూ ఈ మూవీకి 450 థియేటర్లు కేటాయించాలని దిల్ రాజ్ స్టేట్మెంట్ ఇవ్వడం తెలిసిందే.
ఈ సందర్భంగా తమిళనాట విజయ్ పెద్ద స్టార్ అని, అజిత్ సినిమాకు మించి `వారీసు`కు మరో 50 థియేటర్లు అధికంగా కేటాయించాల్సిందే అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ఈ స్టేట్ మెంట్ కారణంగా `వారీసు` అక్కడ వార్తల్లో నిలిచింది, అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీకి భారీ బజ్ అయితే వుంది కానీ ప్రమోషన్స్ మాత్రం ఆ స్థాయిలో లేవంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారట.
ఇప్పటి వరకు వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో `వారసుడు` సినిమాని వార్తల్లో నిలిపిన దిల్ రాజు ప్రమోషన్స్ పరంగా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఫ్యాన్స్ వాపోతున్నారట. ఇదిలా వుంటే తెలుగులో విజయ్ కున్న క్రేజ్ అంతంత మాత్రమే. ఎంత కాంట్రవర్సీ చేసినా విజయ్ మార్కెట్ మాత్రం టాలీవుడ్ లో మారదు. ఈ విషయం తెలిసి కూడా దిల్ రాజు సరైన ప్రమోషన్స్ ని ప్రారంభించడం లేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారట.
ఇదిలా వుంటే జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నిర్మాత దిల్ రాజు భారీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని చెన్నైలో భారీ లెవెల్లో నిర్వహించి తెలుగులోనూ అదే స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాడట. ఇందు కోసం స్వయంగా పవన్‌కల్యాణ్ నే రంగంలోకి దించేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.