చరణ్ బర్త్ డే సందర్బంగా నిన్న ప్రేక్షకుల ముందుకు భీమ్ పర్ రామరాజు అనే వీడియో వచ్చిన విషయం తెల్సిందే. జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ లో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా చరణ్ అల్లూరి పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లూరి పాత్రను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ బర్త్ డే వీడియో వచ్చింది. విజువల్స్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆ వీడియో స్థాయిని పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మలయాళంలో మినహా తెలుగు.. హిందీ... తమిళం.. కన్నడంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోనే చరణ్ బర్త్ డే వీడియో వచ్చింది. దాదాపు అన్ని భాషల్లో కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వీడియోకు హైలైట్ గా నిలిచిందనే కామెంట్స్ వచ్చాయి. ఒక స్టార్ హీరో ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాని చరణ్ మాత్రం ఏకంగా తెలుగుతో పాటు నాలుగు భాషల్లో వాయిస్ ఓవర్ చెప్పాడు. చరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పి మెప్పించాడు కనుక ఎన్టీఆర్ బర్త్ డే కు చరణ్ వాయిస్ ఓవర్ తో భీమ్ పాత్రను పరిచయం చేయాల్సి ఉంటుంది.
ఆ వీడియో కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే జరుగబోతుంది. కొమురం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లూరి అయిన రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వీడియోను జక్కన్న విడుదల చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్ తెలుగు వరకు ఓకే కాని ఇతర భాషల్లో మాత్రం వాయిస్ ఓవర్ చెప్పక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డైలాగ్ డెలవరీలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని.. అది ఏ భాషలో అయినా ఎన్టీఆర్ తన డైలాగ్ డెలవరీతో మెప్పించగలడు. తాజాగా చరణ్ బర్త్ డే వీడియోను కూడా అలాగే మెప్పించాడు. కాని చరణ్ మెప్పించలేక పోవచ్చు అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డేకు తెలుగులో వరకు చరణ్ చెప్పే అవకాశం ఉందని ఇతర భాషల్లో వేరే స్టార్స్ తో చెప్పిస్తారేమో అంటూ అప్పుడే నెటిజన్స్ మద్య చర్చ మొదలైంది. ఎన్టీఆర్ నాలుగు భాషల్లో చెప్పి సాహసం చేశాడు కాని చరణ్ మాత్రం ఆ సాహసంకు సిద్దం అవ్వకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం.
కాని మెగా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ మాదిరిగానే చరణ్ కూడా భీమ్ వీడియోకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అంటూ ధీమాగా చెబుతున్నారు. ఏం జరుగబోతుందో చూడాలి. జక్కన్న అప్పటి వరకు ఏ మాయ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.