టాలీవుడ్ లో పెద్ద కాంపౌండ్ లైన మెగా - నందమూరి ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తారని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ అసాధ్యం అనుకున్న దాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి సుసాధ్యం చేశారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అయితే నందమూరి - మెగా హీరోలను కలిపిన క్రెడిట్ మాత్రం దర్శకధీరుడు రాజమౌళికి దక్కుతుంది. ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. చరిత్రలో కలవని ఇద్దరు విప్లవవీరులు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది.. వారి మధ్య ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 'ఆర్.ఆర్.ఆర్' రూపొందుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభిస్తుంది? ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? అనే దానిపై ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతూనే ఉంది.
రాజమౌళి ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ లో ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరికీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు. తారక్ వాయిస్ తో చరణ్ ఇంట్రో.. చరణ్ వాయిస్ తో తారక్ ఇంట్రో చూపించి బ్యాలన్స్ చేశాడు. అయితే 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతూ 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో అజయ్ దేవ్‌గన్ మినహా ఎన్టీఆర్ - చరణ్ - అలియా భట్ వారి మాతృభాషలో కాకుండా ఇతర భాషలలో మాట్లాడటం విశేషం. అయితే కన్నడ భాషలో మాట్లాడిన తారక్.. మిగతా వారి కంటే ఎఫెక్టివ్ మాట్లాడారని అభిమానులు భావిస్తున్నారు. దీంతో స్క్రీన్ స్పేస్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో మెరుస్తాడని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక తారక్ పుట్టినరోజు సందర్భంగా 'RRR' టీం నుంచి రాబోయే సర్ప్రైజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.